ప్రస్తుతం క్రికెట్ ఆడకున్నా.. టీమిండియా కెప్టెన్ ‘రోహిత్ శర్మ’ పేరు ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. రిటైర్మెంట్ సంగతి అటుంచితే.. అత్యంత కఠినమైందిగా నిపుణులు పేర్కొన్న ‘బ్రాంకో’ ఫిట్‌నెస్ టెస్టులో పాస్ అవుతాడా? అని మాజీలతో సహా అభిమానులు మాట్లాడుకుంటున్నారు. కెరీర్లో అత్యున్నత స్థాయికి చేరుకున్న హిట్‌మ్యాన్ ఫిట్‌నెస్ టెస్ట్ మీద అందరూ దృష్టిసారించడం ఇప్పుడు ఒకింత ఆశ్చర్యానికి గురిచేసేదే. అయితే అందరి సందేహాలను పటాపంచలు చేస్తూ.. రోహిత్ బ్రాంకో టెస్టులో పాసయ్యాడు. ఇక తన…
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే టీ20, టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. హిట్‌మ్యాన్ 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడాలని చూస్తున్నాడు. ఎందుకంటే.. వన్డే ప్రపంచకప్ రోహిత్ కల అని తెలిసిందే. టీ20, టెస్ట్‌లకు వీడ్కోలు పలికిన హిట్‌మ్యాన్.. ఇప్పుడు పూర్తిగా వన్డేలపై మాత్రమే దృష్టి పెట్టాడు. అయితే రోహిత్‌ను టీమ్ నుంచి తప్పించాలనే ప్రయత్నం చేస్తున్నారని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సంచలన ఆరోపణలు చేశాడు.…