అమెరికన్ డాలర్‌కి పోటీగా కొత్త కరెన్సీని ఏర్పాటు చేయాలనే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఖతార్ పర్యటనలో ఉన్న ఆయన నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఇటీవల రష్యా వేదిక జరిగిన బ్రిక్స్ సమావేశం తర్వాత ‘‘బ్రిక్స్ కరెన్సీ’’ ఏర్పాటు చేస్తారనే వార్తలు వచ్చాయి. వర్థమాన ఆర్థిక వ్యవస్థలైన చైనా, భారత్, రష్యా వంటి బ్రిక్స్ కూటమి దేశాలు ఈ కరెన్సీపై కసరత్తు చేస్తున్నాయనే వార్తలు వచ్చిన నేపథ్యంలో అమెరికాకు కాబోయే అధ్యక్షుడు…