తల్లి, బిడ్డల బంధం ఎంత గొప్పదో మాటల్లో చెప్పలేనిది. పురుడుపోసుకుని బయటకు వచ్చిన శిశువుకు వెంటనే మురిపాలు తాగిస్తారు. ఈ పాలు బిడ్డకు ఎంతో ప్రయోజనకరం. శిశువు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే శిశువు బయటకు రాగానే వైద్యులు.. మురిపాలు పట్టించమని చెబుతుంటారు.