Home
Breaking News
Breaking News News
-
ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం..
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి శ్రీకారం చుట్టనుంది. ఈ నిర్ణయంతో 11.56 లక్షల కేంద్ర ఉద్యోగులకు లాభం కలుగనుంది. జనవరి 2022 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ (హౌస్ రెంట్ అలవెన్స్) పెంచేందుకు కసరత్తు ప్రారంభించింది. హెచ్ఆర్ఏ పెరుగనుంది. ఐఆర్‌టీఆఎస్‌ఏ, ఎన్ఎఫ్ఐఆర్ ఉద్యోగులు డిమాండ్ నేపథ్యంలో హెచ్ఆర్ఏ పెంపుకు కేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఎక్స్, వై, జడ్ అంటూ మూడు భాగాలుగా నగరాలను విభజించి, ఎక్స్ భాగానికి రూ.5400, వై భాగానికి… -
బ్రేకింగ్ : ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కర్కర్దుమా మెట్రో స్టేషన్ సమీపంలో గల రిషబ్ టవర్లోని 6వ అంతస్థులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు 14 ఫైర్ ఇంజన్లను రంగంలోకి దింపి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఇప్పటికే కాలుష్యపు పొగమంచుతో నిండిన ఢిల్లీలో ఈ ఘటనతో మరింత పొగ అలుముకుంది. -
బిగ్ బ్రేకింగ్ : హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత
తెలంగాణ వ్యాప్తంగా మాదకద్రవ్యాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న మరోసారి డ్రగ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఫోటోస్ ఫ్రేమ్ వెనుక డ్రగ్స్ పెట్టి పార్శిల్స్ చేసి సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. బేగంపేటలో ఇంటర్ నేషనల్ పార్శిల్స్ ఆఫీసులో పోలీసులు తనిఖీలు చేయగా 14 కిలలో డ్రగ్స్ లభ్యమయ్యాయి. వీటి విలువ సుమారు రూ. 5.5 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు ఈ… -
వర్షాలపై జగన్ సమీక్ష.. బాధితులకు రూ.1000 చొప్పున సహాయం..
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు, చిత్తూరు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నందున ఆయా జిల్లాల కలెక్టర్ అప్రమత్తంగా ఉండాలన్నారు. తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ముఖ్యంగా తమిళనాడు సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని జగన్ సూచించారు. ఇప్పటికే చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు ఎన్డీఆర్ఎస్ బృందాలు చేరుకున్నాయని, కర్నూలులో మరో రెండు బృందాలు సిద్ధంగా ఉన్నాయని… -
కీలక విషయం వెల్లడించిన సజ్జనార్
ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టినాటి నుంచి టీఎస్ ఆర్టీసీని అభివృద్ధి చేసేందుకు తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు సజ్జనార్. ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కొత్త ఆలోచనలతో ప్రయాణికులు ఎక్కువగా ఆర్టీసీ పై దృష్టి పెట్టే విధంగా చేస్తున్నారు. నూతన సంస్కరణలతో ఆర్టీసీ లాభాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా మరో కీలక విషయాన్ని సజ్జనార్ వెల్లడించారు. ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులకు వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. 48,214 మంది ఉద్యోగులతో పాటు 5,034… -
రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది జడ్జీల బదిలీలు..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది జడ్జీల బదిలీలు జరిగాయి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు జడ్జిగా ఈ.తిరుమల దేవి, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా వై. రేణుక, రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ డైరెక్ట్‌గా సీహెచ్‌కే భూపతి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శిగా ఎం.వి.రమేశ్, నిజామాబాద్ జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్ జడ్జిగా కుంచాల సునీత, నల్గొండ జిల్లా ప్రిన్సిపల్ జడ్జిగా బి.ఎస్.జగ్జీవన్ కుమార్, ఆదిలాబాద్ జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జిగా రామకృష్ణ సునీత,… -
పేట్‌బషీరాబాద్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న భార్యాభర్తలతో పాటు ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలియడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చీటింగ్ కేసులో సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు అరెస్ట్..
చీటింగ్ కేసులో సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావును రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. నానక్‌రాంగూడలోని సర్వే నెంబర్ 104లో శ్రీధర్ రావుకు ఐదు ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి సంబంధించిన అంశంలో మమ్మల్ని మోసం చేశాడంటూ రాయదుర్గం పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఆ భూమి అమ్మకం జరిగినప్పుడు తమకు రావాల్సిన అమౌంట్ ఇవ్వకుండా మోసం చేశాడని, డబ్బులు అడిగితే గన్మెన్లను చూపించి బెదిరింపులకు పాల్పడ్డాడని, చంపుతామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. కొందరికి… -
రియా చక్రవర్తి వస్తువులు తిరిగిచ్చేయండి : స్పెషల్ ఎన్డీపీఎస్ కోర్టు
సుశాంత్ రాజ్‌పుత్ అకాల మరణంతో తీవ్ర అరోపణలు ఎదుర్కొంది నటి రియా చక్రవర్తి. కొన్ని రోజుల పాటు జైలు జీవితం కూడా గడిపింది. అయితే విచారణ సమయంలో రియా చక్రవర్తికి సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకున్న అధికారులు బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. జైలు నుంచి బయటకు వచ్చి తిరిగి సినిమాల్లో పాల్గొంటున్న రియా చక్రవర్తి విచారణ సమయంలో స్వాధీనం చేసుకున్న వస్తువులను, బ్యాంక్ ఖాతాలను డీఫ్రీజ్ చేయాలని స్పెషల్ ఎన్డీపీఎస్ కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు… -
అల్లు అర్జున్ కు షాక్ ఇచ్చిన సజ్జనార్
టీయస్ఆర్టీసీ ప్రతిష్టను కించపరిచినందుకు హీరో అల్లు అర్జున్, రాపిడో సంస్థకు లీగల్ నోటీస్ లు ఇచ్చారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. నటుడు అల్లు అర్జున్ నటించిన రాపిడో ప్రకటనపై అభ్యంతరం వ్యక్తంచేసిన ఆర్టీసీ ఎండీ… యూట్యూబ్ లో ప్రసారం అవుతున్న ప్రకటనలో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, రాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని, అదే సమయంలో మసాలా దోసను సిద్ధం చేస్తుందని అల్లు అర్జున్ ప్రజలకు చెప్పడం సరికాదని అన్నారు.…
తాజావార్తలు
-
Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
-
Excise Policy: ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీ.. లాటరీ ద్వారా షాపుల కేటాయింపు..
-
Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
-
Packard Bell: మార్కెట్లోకి పాకర్డ్ బెల్.. ఏసర్ నుంచి ఆరెంజ్, పర్పుల్, గ్రీన్, ఎల్లో కలర్స్‌లో అందుబాటులోకి..
-
BRICS: ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటీ.. వారాల వ్యవధిలో రెండోసారి..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?