తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. రోజురోజుకు గ్రామల నుంచి పట్టణాల వరకు అన్ని చోట్ల రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం పూట పొగమంచు కారణంగా రోడ్లపై వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై వెళ్లే వారికే కాకుండా విమానాల రాకపోకలకు సైతం ఇబ్బంది నెలకొంది. తాజాగా గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఈ రోజు ఉదయం ఎయిర్ఇండియా సంస్థకు చెందిన ఓ విమానం ల్యాండ్ అవ్వాల్సి ఉంది. అయితే ల్యాండింగ్ సమయంలో గన్నవరం ఎయిర్పోర్ట్ రన్‌పై…
తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. నిరుద్యోగ దీక్ష అంటూ బీజేపీ చీప్ బండి సంజయ్ దీక్ష చేపడుతుంటే.. రచ్చబండ అంటూ కాంగ్రెస్ ఓ కార్యక్రమం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో మాజీ పీసీసీ, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు. దేశానికి రాజీవ్‌గాంధీ సేవలు మరవలేనివని, తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబ పాలనలో బందీ అయ్యిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు కేసీఆర్‌ను తుక్కుతుక్కు ఓడిస్తారని ఆయన…
తెలంగాణలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఈ రోజుల హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిరుద్యోగ దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు నిరుద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ దీక్షలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. తెలంగాణలో నాదర్శ్ షా ప్రభుత్వం నడుస్తుందని, ప్రతి ఇంటికో ఉద్యోగం ఇస్తా అని కేసీఆర్ అన్నాడు.. వచ్చాయా అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ మంత్రి…
టీపీసీస రేవంత్ రెడ్డిపై ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి తీవ్రంగా విమర్శలు గుప్పించారు. బీజేపీకి అమ్ముడుపోయిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని, నాడు టీడీపీని కాంగ్రెస్ కు అమ్మి… నేడు కాంగ్రెస్ ను బీజేపీకి అమ్మే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అంతే కాకుండా కేసీఆర్ రైతు బిడ్డ.. రేవంత్ రెడ్డి కమర్షియల్ బిడ్డ. ఏది ఎక్కడ ఎంతకు అమ్ముకోవాలనే చూస్తారని, ఎర్రవెల్లి గ్రామానికి వస్తే తరిమికొడతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారని ఆయన అన్నారు. రేవంత్…
ఏపీ ప్రభుత్వం ఇటీవల వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ఓటీఎస్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలు చేస్తున్నాయి. అయితే తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ఓటీఆఎస్ను రద్దు చేయాలంటూ కలేక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ.. అన్ని వర్గాల వారిని జగన్ దోపిడీ చేస్తున్నాడని ఆయన అన్నారు.…
వరి కోసం తెలంగాణలో అధికార పార్టీకి విపక్షాలకు మధ్య వార్ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు చేయమని చెప్పడంతో యాసంగిలో వరి ధాన్యం వేయకూడదని సీఎం కేసీఆర్ వెల్లడించారు. అయితే విపక్షాలు మాత్రం వరి వేయండి అంటూ రైతులకు సందేశాలు ఇస్తున్నాయి. అయితే దీనిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్‌కు సంబంధించి ప్రత్యక్ష ప్రసారాన్ని ఈ క్రింద ఇచ్చిన లింక్‌లో వీక్షించండి.
హైదరాబాద్‌లోని కొన్ని పబ్‌లు పరిమితి సమయాన్ని మించి నడిపిస్తున్నారని, ఇళ్ల మధ్యలో లౌడ్ స్పీకర్లు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇటీవల పలువురు హైకోర్టును ఆశ్రయించారు. అయితే వారి పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు పరిమితి సమయాన్ని మించి పబ్‌లు నిర్వహించవద్దని, నివాస ప్రాంతాలకు సమీపంలో పబ్‌లు నిర్వహించరాదని హెచ్చరించింది. దీంతో నిన్న జూబ్లీహిల్స్ ర్యాబిట్ పబ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. గత రాత్రి సమయానికి మించి పబ్ యాజమాన్యం పబ్ నడిపినట్లు సమాచారం రావడంతో…
రాజేంద్రనగర్ పుప్పాలగూడ వద్ద భీమయ్య అనే ఎలక్ట్రీషియన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నిన్న ఉదయం ఉద్యోగం నిమిత్తం బయటకు వెళ్లిన భీమయ్య ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో నార్సింగి పోలీసులకు భీమయ్య స్నేహితుడు శ్రీనివాస్ ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అయితే ఈ రోజు ఉదయం పుప్పాల్ గూడ గుట్టల మధ్య మృతదేహం లభ్యమైంది. ఒంటి పై బట్టలు లేకుండా శరీరం పై తీవ్రగాయాలు, ఎడమ కాళు విరిగి…
గత శనివారం రాత్రి మొయినాబాద్ సమీపంలో ముగ్గురు యువతులు ఒక స్కూటీ వస్తుండగా చెవేళ్ల నుంచి హైదరాబాద్‌కు అతివేగంగా వస్తున్న కారు యువతుల స్యూటీని ఢీ కొట్టింది. దీంతో స్యూటీపై ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ప్రేమిక, సౌమ్య, అక్షరలు కిందిపడిపోయారు. అయితే ప్రేమిక తలకు బలమైన గాయమవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సౌమ్య, అక్షరలకు తీవ్ర గాయాలవడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న అక్షర ఈ రోజు మృతి చెందింది. ఇప్పటికే ఈ…
దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించింది. ఇటీవల ఈ వేరియంట్ భారత్‌లోకి కూడా ప్రవేశించింది. అయితే రోజురోజుకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగతూ వస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా మరో 69 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 530కి చేరుకుంది. మహారాష్ట్రలో మొత్తం 141 ఒమిక్రాన్ కేసులు ఉండగా, ఢిల్లీలో 79, కేరళలో 57, గుజరాత్లో 49, తెలంగాణలో 44, ఏపీలో 6 చొప్పున…