రాజేంద్రనగర్ పుప్పాలగూడ వద్ద భీమయ్య అనే ఎలక్ట్రీషియన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నిన్న ఉదయం ఉద్యోగం నిమిత్తం బయటకు వెళ్లిన భీమయ్య ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో నార్సింగి పోలీసులకు భీమయ్య స్నేహితుడు శ్రీనివాస్ ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అయితే ఈ రోజు ఉదయం పుప్పాల్ గూడ గుట్టల మధ్య మృతదేహం లభ్యమైంది.
ఒంటి పై బట్టలు లేకుండా శరీరం పై తీవ్రగాయాలు, ఎడమ కాళు విరిగి ఉండటంతో పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. అయితే మృతుడు కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా కు చెందిన భీమయ్యగా పోలీసుల గుర్తించారు. ఈ నేపథ్యంలో డ్యూటీకి వెళ్లిన భీమయ్య.. పుప్పాల్ గూడ గుట్ట పైకి ఎందుకు వెళ్లాడు? ఒంటి మీద బట్టలు ఎందుకు లేవు? హోమో సెక్స్ చేసి హత్య చేసి ఉంటారా? అనే కోణం లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.