కరోనా పుట్టినిల్లు చైనాలో మరోసారి కరోనా విజృంభించిన సంగతి తెలిసిందే. కరోనా కేసులు భారీగా నమోదువుతుండడంతో చైనాలోని అతి పెద్ద నగరమైన షాంఘై సిటీలో అధికారులు లాక్డౌన్ విధించారు. కరోనా కేసులు కట్టడికి చైనా యంత్రాంగం కఠిన నిబంధనలతో లాక్డౌన్ను అమలు చేసింది. కరోనా సోకిన ప్రదేశాలలో ముళ్ల కంచెవేసి, ఆ ప్రాంతం నుంచి ఎవ్వరినీ బయటకు రాకుండా చర్యలు తీసుకుంది. అంతేకాకుండా షాంఘై సిటీలో లాక్డౌన్ నిబంధనలతో ప్రజలు చాలా ఇక్కట్లు పడ్డారు కూడా. అయితే..…
కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరోసారి విమర్శలు గుప్పించారు. తాజాగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. అక్రమ నిర్మాణాల పేరుతో బీజేపీ బుల్డోజర్లతో ప్రజల ఇండ్లు, దుకాణాలను కూల్చివేయడం సరైంది కాదని, స్వాతంత్ర్యం తరువాత ఇదే దేశంలో అతి పెద్ద విధ్వంసమని ఆయన అభివర్ణించారు. ఢిల్లీలో కాషాయ పార్టీ బుల్డోజర్లు ఇదే తరహాలో తిరిగితే నగరంలో 63 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులవుతారని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆక్రమణలను మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ)…
రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోతోంది. అత్యాధునిక సదుపాయలతో మానవాళి కొత్తం పుంతలు తొక్కుతోంది. భారత్లో టెక్నాలజీని వినియోగించేందుకు ప్రధాని మోడీ డిజిటలైజేషన్కు శ్రీకారం చుట్టారు. ఆఫీసుల్లో, నగదు లావాదేవీల్లో సైతం డిజిటలైజేషన్ ప్రకారం పనులు జరుగాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. గత 5 సంవత్సరాల్లో దేశంలో నగదు రహిత లావాదేవీలు పెరిగాయి. అయితే.. దేశంలో యూపీఐ ఎంతగానే ఉపయోగపడుతోంది అని అనడంలో సందేహం లేదు. దేశంలో ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలం, గ్రామం ఇలా…
ఇటీవల న్యూయార్క్లోని టాప్స్ సూపర్ మార్కెట్లో ఓ దుండగులు కాల్పులకు తెగబడి సుమారు 10 మందిని పొట్టన పెట్టుకున్నాడు.. అంతేకాకుండా కాల్పులు జరిపేటప్పుడు లైవ్ స్ట్రీమింగ్ కూడా చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ విషాద ఘటన మరవకముందే మరో దుర్ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. తాజాగా.. అమెరికాలోని హ్యుస్టన్ బహిరంగ మార్కెట్లో ఓ దుండగుడు కాల్పులు జరపడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే రెండు గ్రూపుల మధ్య చోటు…
వేసవికాలం ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు భారత్లోకి ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ముందుగా అండమాన్ నికోబార్ దీవులకు రుతుపవనాలు వస్తాయని తెలిపిన వాతావరణ శాఖ.. ఆ తర్వాత బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో రుతుపవనాలు విస్తరిస్తాయని పేర్కొంది. ఈ నెలఖరులోగా కేరళను తాకుతాయని చెప్పింది. జూన్ 8వ తేదీ లోగా తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తెలిపింది వాతావారణ శాఖ. మరోవైపు నిన్న…
పాకిస్థాన్లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు సిక్కు వ్యాపారులను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాష్ట్రంలో సల్జీత్ సింగ్ (42), రంజీత్ సింగ్ (38) వ్యాపారం చేస్తుంటారు. అయితే.. ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాజధాని అయిన పెషావర్లో దాదాపు 15 వేల మంది వరకు సిక్కులు నివసిస్తుంటారు. వారిలో అత్యధికులు వ్యాపారులే ఉండగా.. వీరిపై దాడులు సర్వసాధారణంగా మారుతున్నాయి. గతేడాది సెప్టెంబరులో యునానీ వైద్యుడు హకీం, అంతకుముందు ఏడాది ఓ…
అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 6 జిల్లాలో వరద నీరు పోటెత్తడంతో వందలాది గ్రామాలు నీటమునిగాయి. 24 వేల మంది కంటే ఎక్కువగా వరద నీటిలో చిక్కుకున్నట్లు అధికారులు అంచానా వేస్తున్నారు. అంతేకాకుండా వరదల ధాటికి ముగ్గురు ప్రాణాలు కొల్పోయారు. అస్సాంలోని పలు జిల్లాలో ఈదురు గాలులతో కూడి భారీ వర్షాలు అక్కడి ప్రజలను అతలాకుతలం చేశాయి. దీనితో పాటు 12 గ్రామాల్లో కొండ చరియలు విరిగి పడ్డాయి. వరద ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా…
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, అందాల తార సమంత కలిసి ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా పేరును ప్రకటిస్తూ.. మేకర్స్ నేడు ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. విజయ్-సమంత నటిస్తున్న ఈ సినిమాకు ‘ఖుషి’ అనే పేరును ఖరారు చేశారు చిత్రయూనిట్. ఒక ఎపిక్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 23న థియేటర్లలో విడుదల…
ఎప్పుడూ తమ కస్టమర్లను సంతృప్తి పరచడానికి ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటుంది. అయితే తాజాగా మరో ఆఫర్ను ఫ్లిప్కార్ట్ ప్రకటించింది. స్మార్ట్ టీవీలపై ఫ్లిప్కార్ట్ ఆకర్షణీయమైన తగ్గింపులను ప్రకటించింది. వీయూ ప్రీమియం 80 సెంటీమీటర్ల(Vu Premium TV 80 cm (32 inch) HD Ready LED Smart TV) టీవీపై భారీ ఆఫర్లు అందుబాటులో తీసుకువచ్చింది ఫ్లిఫ్కార్ట్. వీయూ ప్రీమియం టీవీ 80 సెం.మీ (32 అంగుళాల)…
73 ఏండ్ల ప్రతిష్టాత్మక థామస్ కప్ లో సరికొత్త చరిత్రను సృష్టించిన భారత బ్యాడ్మింటన్ జట్టుపై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. ఈ విజయం అపూర్వమని, భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజని టీమిండియా క్రికెటర్లు కొనియాడుతున్నారు. 14 సార్లు ఛాంపియన్ అయిన ఇండోనేషియాను టీమిండియా.. 3-0తో మట్టి కరిపించి థామస్ కప్-2022 స్వర్ణాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే.. వీరి విజయ దుందుభికి దేశం మొత్తం హర్షధ్వానాలు వినిపిస్తున్నాయి. అందరూ ఈ విజయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే…