కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, అవినీతి, అప్పుల్లో కూరుకు పోయి దివాలా తీస్తున్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. ఉచితాలు, హామీలు గ్యారంటీల పేరుతో ఎన్నికలకు ముందు చెప్పి ఎన్నికలయ్యాక ప్రజల గోస పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాహుల్ గాంధీ కటాకట్ కటాకట్ డబ్బులు వేస్తామని చెప్పారని, ఇప్పుడు తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు ఫటాఫట్ దివాలా తీశాయని ఆయన సెటైర్లు వేశారు. తెలంగాణ ఢిల్లీకి ఎటీఎంగా మార్చారని, ప్రజల్ని మభ్య పెట్టేందుకు రేవంత్ రెడ్డి…
ప్రస్తుతం తెలంగాణలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) వ్యవహారం హాట్ టాపిక్గా నడుస్తోంది. ఇటీవల ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ను హైడ్రా కూల్చడంతో ఒక్కసారిగా అందరి దృష్టి దీనిపైనే ఉంది. అంతేకాకుండా.. రోజు రోజుకు హైడ్రా స్పీడ్ పెంచి అక్రమ కట్టడాలను కూల్చేందుకు దూకుడుగా వ్యవహరిస్తోంది. అయితే.. హైదరాబాద్ ప్రాంతాల్లో ఉన్న చెరువులను అక్రమంగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వాటిని కూల్చివేస్తున్న హైడ్రా…
రంగారెడ్డి జిల్లా పాలమాకుల గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తే ఎందుకు స్పందించరని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని, ప్రతిపక్షాల మీద విమర్శ చేయడం తప్ప పాలన మీద దృష్టి లేదని ఆయన విమర్శించారు. చీమ కుట్టినట్లు అయినా మీకు లేదు. సిగ్గుచేటని, గురుకులాల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయే పరిస్థితి అన్నారు హరీష్…
ఏడు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాన్ని నియమిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్, జగిత్యాల జిల్లాలోని వెలగటూరు, కామారెడ్డి జిల్లాలోనే గాంధరి, సదాశివనగర్, ఎల్లారెడ్డి, ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి, మద్దులపల్లి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు చైర్ పర్సన్ లను, వైస్ చైర్ పర్సన్లతో పాటు నూతన పాలకవర్గాలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. మహబూబ్ నగర్ మార్కెట్ కమిటీ చైర్…
ప్రత్యామ్నాయం చూపకుండా పేదల ఇళ్లు కూల్చొద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరుతో చెరువులు, నాలలలో వున్న నిర్మాణాలను తొలగిస్తున్న సందర్భంగా పేదలు, మధ్యతరగతి ప్రజానీకం దీనికి సమిధలు కాకుండా ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో జలవనరుల సంరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకువచ్చిన హైడ్రా వ్యవస్ధ ఆహ్వానించదగ్గదేనన్నారు. అయినప్పటికీ చెరువులు, నాలల పక్కన సంవత్సరాలుగా నివసిస్తున్న పేదలకు ప్రత్యామ్నాయం…
స్పీడ్ ప్రాజెక్టులపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి కొత్త పాలసీ రూపొందించండని, ఇతర రాష్ట్రాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేయండన్నారు సీఎం రేవంత్. ఎకో, టెంపుల్ టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించండని, వీటితోపాటు హెల్త్ టూరిజంను అభివృద్ధి చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ బయట మరో జూపార్క్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించండని, మనకున్న వనరుల అభివృద్ధికి అవసరమైనచోట పీపీపీ…
2026 మార్చి నాటికి పూర్తి చేస్తాము. సోనియా గాంధీ తో ప్రారంభిస్తాం అని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు 300 రోజుల పాటు నీటి యెత్తిపోసేలా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తాం అన్నారు.. పెండింగ్ బిల్ అన్ని క్లియర్ చేస్తాం అన్న మంత్రులు.. పొరుగు రాష్ట్రాల తో సత్ సంబంధాలతో ఉంది త్వరితగతిన ప్రాజెక్టు పనుల చేపడతాం అన్నారు. గత ప్రభుత్వం కేవలం పనులు చేశారు జేబులు నింపుకున్నారు కానీ…
రెండు రోజుల క్రితం గాజుల రామారంలో కాల్పులు జరిపిన నిందితులను 48 గంటలలో పట్టుకొని మీడియా ముందు హాజరుపరిచారు పోలీసులు.. 27 తారీఖు అర్థరాత్రి గాజుల రామా రం LN బార్ దగ్గర పెట్రోల్ దొంగలిస్తూ జరిగిన గొడవలో ముఖ్య నిందితుడు నరేష్ ఆదేశాలతో అనుచరుడు శివ కంట్రీమేడ్ తుపాకీతో బార్ సిబ్బందిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపి తార్ వాహనంతో గుద్ది చంపాలని ప్రయత్నించడం బార్ సిబ్బంది గాయాలతో తప్పించు కొని పోలీసులకు ఫిర్యాదు చేసారు..…
గెలుపు అంటే ఎంపీలు, ఎమ్మేల్యేలు గెలవడమే కాదని, ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నుంచి ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడు అందులో ఒకరు తెలంగాణ నుంచి గెలిచారు. మరొకరు గుజరాత్ నుంచి గెలిచారని, గుజరాత్ లో పార్టీ అధికారంలోకి వచ్చింది.. తెలంగాణలో ఎందుకు అధికారంలోకి రాలేకపోతున్నామన్నారు ఈటల రాజేందర్. 46 ఏళ్ల తర్వాత తెలంగాణలో 8 పార్లమెంట్ స్థానాలు గెలిచామని, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్,…
ములుగు జిల్లా దేవాదుల ప్రాజెక్టును మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, సీతక్క పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 2026 మార్చిలో దేవాదుల ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. సోనియా గాంధీ చేతులమీదుగా ప్రారంభోత్సవం చేస్తామని ఆయన వెల్లడించారు. ఇరిగేషన్ శాఖను అడ్డుపెట్టుకొని దోపిడీకి కేసీఆర్ పాల్పడ్డారని, ప్రతీ ప్రాజెక్టులో వేల కోట్ల స్కాం జరిగిందని ఆయన ఆరోపించారు. 1.81 లక్షల నిధులు కేసీఆర్ హాయంలో ఖర్చుపెట్టారని, 14వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో…