రాష్ట్రంలో ప్రజారోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు కొత్తగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీతో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కీలక సమావేశం నిర్వహించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి టి రాజయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కమిటీలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే మెటుకు ఆనంద్ ఉన్నారు. తెలంగాణలో క్షీణిస్తున్న ఆరోగ్య వ్యవస్థను అధ్యయనం చేయడానికి , ప్రభుత్వానికి సహాయం చేయడానికి ఈ బృందం ఏర్పడింది , ఈ రోజు తన కార్యకలాపాలను ప్రారంభించింది.…
అమీన్ పూర్లో చీకట్లో కూడా ఆగకుండా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కృష్ణారెడిపేటలో లైట్ల వెలుతురులో అక్రమ నిర్మాణాలను బాహుబలి మిషన్ కూల్చివేస్తోంది. అక్రమ నిర్మాణాన్ని ఆనుకుని ప్రక్కనే మరొక అపార్ట్మెంట్ ఉంది. అయితే.. ఆ అపార్ట్మెంట్ కు ఇబ్బంది కలుగకుండా కూల్చే ప్రయత్నం చేస్తున్నారు హైడ్రా అధికారులు.. పూర్తి నిర్మాణాలు కూల్చే వరకు హైడ్రా యాక్టివిటీ కొనసాగనున్నట్లు అధికారులు చెబుతున్నారు. పటేల్ గుడా లో చివరి దశ…
ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) నేడు హైదరాబాదులో తనిఖీలు చేపట్టింది. సైదాబాద్ ప్రాంతంలోని శంఖేశ్వర్ బజార్ గ్రీన్ వ్యూ అపార్ట్ మెంట్ లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎన్ఐఏ తనిఖీలు దాదాపు గంటసేపు కొనసాగాయి. ఎన్ఐఏ ఆగస్టులో ఉగ్రవాది రిజ్వాన్ అబ్దుల్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రిజ్వాన్ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ తో సంబంధం ఉన్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అని ఎన్ఐఏ గుర్తించింది. రిజ్వాన్ అబ్దుల్ ఐసిస్ తరఫున పుణే…
హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉప్పల్, నాగోల్, బండ్లగూడ, ఎల్బీ నగర్, సరూర్‌నగర్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. సైదాబాద్, దిల్సుఖ్నగర్, రామంతాపూర్, అంబర్పేట్, మీర్పేట్, గుర్రంగూడ, వనస్థలిపురంలోనూ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే.. రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని , భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్…
కేటీఆర్ పచ్చి అబద్దాల మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. కేటీఆర్ లేని పోని ..నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షం ఉందా.. ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడా అనేది కూడా తెలియకుండా పోయిందన్నారు. పచ్చకామెర్లు వాడికి ప్రపంచం అంతా పచ్చగా కనిపించినట్టు ఉంది కేటీఆర్ పరిస్థితి ఉందన్నారు. మీలాగా మేము ఉండమని, మేము అధికారం లోకి వచ్చి 8 నెలలు.. 8 వేల కోట్లు ఎక్కడ వచ్చాయో చెప్పాలన్నారు. కాళేశ్వరం కూలిపోయింది.దాంట్లో…
ఈ రోజు చేపట్టిన కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వివరాల ప్రెస్ నోట్ విడుదల చేశారు. కూకట్ పల్లిలోని నల్లచెరువు సర్వే నెం. 66, 67, 68, 69లోని అనధికారికంగా నిర్మించిన షెడ్లను కూల్చివేశామన్నారు. 16 కమర్షియల్ షెడ్లు, ప్రహారి గోడల కూల్చివేత కూకట్ పల్లి నల్లచెరువు పరిధిలో 4 ఎకరాల స్థలం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అమీన్ పూర్ మండలం కిష్టారెడ్డిపేటలో ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలు సర్వే నెం.164లో మూడు భవనాలు కూల్చివేసినట్లు, వాణిజ్య…
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం పడడంతో నాళాల వద్ద వరద ప్రవాహం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని మాన్ హోల్స్ వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో నగరంలో వచ్చే రెండు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఎ , వాటర్ వర్క్స్ , విద్యుత్…
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. బషీర్‌బాగ్, అబిడ్స్, నాంపల్లి, కోటి, నారాయణగూడ, ముషీరాబాద్, సికింద్రాబాద్, హిమాయత్ నగర్, ఉప్పల్, ఎల్బి నగర్, కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌తో సహా పలు ప్రాంతాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ట్రాఫిక్ జామ్‌లకు దారితీసింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో నీటి ఎద్దడి పరిస్థితిని మరింత దిగజార్చింది. సాయంత్రం ప్రారంభమైన వర్షం, కార్యాలయానికి వెళ్లేవారు ఇళ్లకు…
పాలేరు నుంచి సాగర్ కాలువలకి గత నెలలో వచ్చిన వరదల వల్ల గండ్లు పడటంతో ఆ గండ్లని పూడ్చివేశారు. అయితే గండ్లను పూడ్చి నీళ్లు విడుదల చేసినప్పటికీ వెంటనే మళ్ళీ గండి పడింది. దీంతో మళ్ళీ నీటి విడుదలని నిలిపివేశారు. గత నెల 30 ,31 తేదీల్లో భారీ ఎత్తున ఖమ్మం జిల్లాలో వరదలు వచ్చాయి. ఈ వరదలు తో పాలేరు నుంచి దిగువకి నాగార్జునసాగర్ కాలువల కు గండ్లు పడ్డాయి. పాలేరు వద్ద ఒకే చోట…
కార్మిక, ఉపాధి శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. ఈ సందర్భంగా అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ గా మారుస్తున్న నేపథ్యంలో సిబ్బంది కొరత లేకుండా చూడాలని సూచించారు. ప్రస్తుత ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా సిలబస్ ను అప్ గ్రేడ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సిలబస్ మార్పుకు కమిటీని నియమించి నిపుణుల సలహాలు, సూచనలు స్వీకరించాలని ఆదేశించారు సీఎం రేవంత్. Suicidal Behavior:…