తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత ఐదు రోజులుగా సమ్మె చేస్తున్న స్టోన్ క్రషర్స్ అసోసియేషన్ మంత్రి కోమటిరెడ్డి హామీతో సమ్మె విరమించినట్లు ప్రకటించింది. బంజారాహిల్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు కమలాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు నందిరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ లు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సమ్మె విరమించి స్టోన్ క్రషర్స్ నేటి సాయంత్రం నుంచి తమ కార్యకలాపాల ప్రారంభిస్తామని తెలిపారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రభుత్వపరంగా…
హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని ఎం.ఎన్.జే క్యాన్సర్ ఆస్పత్రి లో ఏర్పాటు చేసిన శానిటేషన్, సెక్యూరిటీ అండ్ క్యాన్సర్ నివారణకు అవసరమైన అవగాహన సెంటర్ లను పరిశీలించారు. ఎం.ఎన్.జే క్యాన్సర్ ఆసుపత్రి లో శ్రీనివాసన్ మునుస్వామి రాధా అద్దంకి ట్రస్ట్ ఆధ్వర్యంలో గత ఒకటిన్నర సంవత్సరాల నుండి డా. శరత్ అద్దంకి తన సొంత వ్యయంతో ఆస్పత్రిలో…
బీఆర్ఎస్ సోషల్ మీడియా సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, అనుములకి ఎనుములకి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారంటూ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిత్రపురి సొసైటీలో జరిగిన అవినీతికి సీఎం రేవంత్ రెడ్డికి ఏంటి సంబంధమని ఆయన ప్రశ్నించారు. ఎప్పుడైనా రేవంత్ సోదరులో మహేంద్ర రెడ్డి అనే పేరు విన్నారా..? అని ఆయన ప్రశ్నించారు. నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే ప్రభుత్వానికి ఇవ్వండి తప్పకుండా వారిపై మా…
మల్కాజ్గిరి పార్లమెంట్ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నేను సీఎంగా ఇప్పుడు ఇక్కడ మాట్లాడగలుగుతున్నానంటే ఆ గొప్పతనం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ నాయకులదన్నారు. ఆనాడు నాయకులు అమ్ముడుపోయినా కార్యకర్తలు భుజాలపై మోసి గెలిపించి నన్ను ఢిల్లీకి పంపించారన్నారు. 2,964 బూత్ లలో ప్రతీ బూత్ లో ఒక సైనికుడిలా కార్యకర్తలు పనిచేశారని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం మల్కాజిగిరి అని, నాటి మల్కాజిగిరి గెలుపు…
రైతుబంధు 5 ఎకరాలవరకు ఇవాళ రేపు పూర్తి చేస్తామని, ధరణిపై త్వరలో శ్వేత పత్రం విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోదండ రెడ్డి చెప్పిన దానికంటే ఎక్కువ అక్రమాలు ఉన్నాయని, నా దగ్గర ధరణికి చెంది మరింత సమాచారం ఉందని ఆయన పేర్కొన్నారు. అన్ని వివరాలతో బైట పెడతామని, మేము అధికారం చేపట్టిన రెండుమూడు రోజుల్లో power shut down చెయ్యాలని ప్లాన్ ఉండిందన్నారు మంత్రి పొంగులేటి.…
ర్యాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో A13 అబ్దుల్ రెహమాన్ అనే నిందితుడిని అరెస్ట్ చేసినట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించారు. అతని తో పాటు నరేందర్ అనే ఢిల్లీ కి చెందిన మరొక నిందితుడిని అరెస్ట్ చేశామని, వీరి వద్ద నుండి 11 గ్రాముల ఎండిఎంఏ, జాగ్వార్ కారు మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు డీసీపీ వినీత్. నిందితులు ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరబాద్ లో విక్రయిస్తున్నారని, హైదరబాద్ లో 15 మంది ఏజెంట్ల సాయంతో…
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన గవర్నర్కు ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని.. స్వర్ణపుష్పార్చనలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు అనంతరం వేద ఆశీర్వచనం చేశారు ఆలయ అర్చకులు. ఈ సందర్భంగా స్వామివారి తీర్థప్రసాదాల ఆలయ అర్చకులు, అధికారుల అందజేశారు. అంతేకాకుండా.. స్వామి వారి చిత్రపటాన్ని గవర్నర్ కు బహుకరించారు సీఎస్శాంత కుమారి. ఈ సందర్భంగా గవర్నర్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట…
బీఆర్ఎస్ నాయకులు మాటలు నేతీ బీరకాయలో నెయ్యి అనె చందoలాగా ఉన్నాయని, గత పది సంవత్సరాలలో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన అనేక సందర్భాలలో కేవలం ఎన్నికల సంవత్సరంలో ఎకరానికి రూ.10,000 పరిహారం ప్రకటించి హడావిడి చేసి కేవలం 150 కోట్లు మాత్రమే విడుదల చేసారన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇవాళ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. తదనంతరం 350 కోట్లకి ఉతర్వూలు జారీచేసి పరిహారం అందించిన పాపాన పోలేదు అదే విధంగా అదే…
మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం బీజేపీ మేనిఫెస్టోను మోడీ గ్యారంటీ, ఈటల ష్యూరిటీ పేరుతో విడుదల చేశారు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. వేలాదిగా తరలివచ్చి నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నాయకులకు, అభిమానులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. మే 13 వ తారీకు నాడు దేశవ్యాప్తంగా ఎన్నికల్లో భాగంగా ఎన్నికల శంఖారావంను మల్కాజిగిరిలో స్వయంగా భారత ప్రధానమంత్రి మోడీ ప్రారంభించడం జరిగిందని, యావత్ తెలంగాణ మోడీ ఆలోచనతో 370 సీట్లకు పైగా బీజేపీ సొంతంగా…
నిజామాబాద్ జిల్లాలో యాసంగి సీజన్లో కొనుగోలు కేంద్రాల ద్వారా 6 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు తెలిపారు. జిల్లాలో మొత్తం 462 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని, వాటిలో 417 కేంద్రాలు సహకార సంఘాల కింద, 39 ఐకేపీ (ఇందిరా క్రాంతి పథం) ద్వారా, ఆరు కేంద్రాలు మునిసిపల్ ఏరియాల్లో పేదరిక నిర్మూలన మిషన్ (మెప్మా) కింద పనిచేస్తాయని తెలిపారు. ఆయన ప్రకారం, ప్రభుత్వం…