ఇటీవలి నివేదిక ప్రకారం, మోసపూరిత కార్యకలాపాల కారణంగా దేశవ్యాప్తంగా 18 లక్షల మొబైల్ కనెక్షన్లను టెలికాం ఆపరేటర్లు డిస్కనెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా, గత ఏడాది ఏప్రిల్ 30 నాటికి, టెలికాం మంత్రిత్వ శాఖ మోసాలను నిరోధించడానికి దాదాపు 1.66 కోట్ల కనెక్షన్లను డిస్కనెక్ట్ చేసినట్లు టెలికాం అధికారులు న్యూస్ మీడియా న్యూస్ 18కి తెలిపారు. ఈ చర్యలు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT)తో సహా చట్ట అమలు సంస్థల నేతృత్వంలోని వివరణాత్మక దర్యాప్తును అనుసరిస్తాయి.…
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వర్షపాతం హెచ్చరిక జారీ చేయడంతో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందనుంది . హైదరాబాద్‌లో ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఒకచోట భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.…
చంద్రబాబు విదేశీ పర్యటన మిలియన్ డాలర్ల ప్రశ్న అని మంత్రి జోగి రమేష్ అన్నారు. ఏ దేశానికి వెళ్ళాడో.. ఎక్కడికి వెళ్ళాడో పార్టీ నేతలకు సైతం తెలియదని, విదేశీ పర్యటన ఇంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటి..? అని మంత్రి జోగి రమేష్ అన్నారు. ఎన్నికల్లో దోచుకున్న డబ్బులు దాచుకోడానికి వెళ్లాడుకనుకే ఇంత రహస్యమన్నారు. విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి వెళ్లారో ప్రజలకు చెప్పాలి. ఏ దేశం వెళ్లినా ఒక ఫోటో దిగి పంపించే చంద్రబాబు.. ఈసారి ఎందుకు…
విజయవాడలో డయేరియా మరణాలు ఆందోళనకరమన్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే సమస్యపై దృష్టి పెట్టాలన్నారు. కలుషిత నీరు సరఫరా కారణంగానే ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని, దీనిపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు చంద్రబాబు. విజయవాడలో డయేరియాతో వారం రోజుల వ్యవధిలో 9 మంది చనిపోవడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డయేరియాతో కాకుండా…
రక్షించాల్సిన పోలీసులే.. భక్షకులుగా మారుతున్నారు. కన్ను మిన్ను కానకుండా స్త్రీలపై తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. బైక్‌పై వెళ్తున్న ఓ జంటను పోలీస్ వాహనంలో తన స్నేహితుడితో కలిసి వచ్చిన ఓ హోంగార్డ్ అడ్డగించి, బెదిరించి మహిళను తుప్పల్లోకి తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు దిశ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం నుంచి కుమిలి వెళ్లే రహదారిలో బైక్‌పై తన కుటుంబసభ్యుడితో కలిసి వెళ్తున్న సుమారు 45 ఏళ్ల వయసు…
ఏపీలో నేడు జూన్ నెలకు సంబంధించిన పింఛన్ల పంపిణీ ప్రారంభం కానుంది. జూన్ 1వ తేదీ కావడంతో పింఛన్లు పంపిణీ చేయడానికి అధికార యంత్రాంగం సిద్ధమైంది. మొత్తం 65.30 లక్షల మందికి నేటి నుంచి పింఛన్లను అందించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే 1,939 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. 80 సంవత్సరాలు పై బడిన పెన్షన్ దారులకు, వికలాంగులకు ఇంటి వద్దకే పెన్షన్ అందించనున్నారు. మిగిన లబ్ధిదారులకు గత నెలలో లాగా బ్యాంకులో జమ చేయనున్నారు.…
జగన్ రెడ్డి మోహన్ తన లండన్ పర్యటన నుండి శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరిగి ఏపీకి చేరుకున్నారు. లండన్ నుంచి రాష్ట్రానికి సీఎం కుటుంబం చేరుకుంది. గన్నవరం ఎయిర్ పోర్టులో సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఎంపీలు విజయసాయిరెడ్డి, నందిగం సురేష్ ,మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ,కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున,కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ , వెలంపల్లి శ్రీనివాసరావు, కైలే అనిల్ కుమార్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, టిజె, సుధాకర్…
ACP Umamaheshwar Rao: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ఏసీపీ ఉమామహేశ్వరరావు ఏసీబీ కస్టడీ నేటితో ముగయనుంది.
ఫోన్ ట్యాపింగ్‌లో ప్రణీత్‌రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 1200 మంది ఫోన్లను టాప్ చేసినట్లు ప్రణీత్‌రావు పేర్కొన్నారు. జడ్జిలు రాజకీయ నేతలు ప్రతిపక్ష నేతలు కుటుంబ సభ్యులు మీడియా పెద్దలు జర్నలిస్టుల ఫోన్లు టాప్ చేసినట్లు ఆయన తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారవేత్తలు ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లు టాప్ చేసినట్లు.. 8 ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందితో టచ్ లో ఉన్న ప్రణీత్‌రావు పేర్కొన్నారు. అధికారికంగా మూడు ఫోన్లు…
తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. . రాష్ట్ర ముఖ్యమంత్రి తోపాటు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, యారా ప్రముఖులు హాజరయ్యే ఈ ఆవిర్భావ వేడుకల నిర్వహణకు సికిందరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో వివిధ శాఖలు పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేపట్టాయి. ఉదయం ముఖ్యమంత్రి గన్-పార్క్ లో అమరవీరుల స్థూపానికి పూల మాలలు సమర్పించి నివాళులు అర్పించిన అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో పలు కార్యక్రమాలలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో…