Home
Breaking News
Breaking News News
-
Fire Accident: భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన గుడిసలు, కట్టెల దుకాణం.!
Fire Accident: హైదరాబాద్ కూకట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దోమల నివారణ కోసం పెట్టిన పొగతో హరిజన సేవా సంఘం కాలనీలో గుడిసలు తగలబడ్డాయి. పక్కనే ఉన్న కట్టెల దుకాణానికి మంటలు వ్యాపించడంతో షాప్ కాలి బూడిదయింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు అవ్వడంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలకి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసే సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం (CRPF)కు చెందిన నలుగురు సిబ్బంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరు అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ల (ASI) పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని కొంటా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, CRPF 50వ బెటాలియన్‌కు చెందిన అమ్యూనిషన్ టెక్నికల్ టీమ్‌లో ఈ నలుగురు సిబ్బంది… -
Plane Crash: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. చిన్న విమానం క్రాష్, ఇద్దరు మృతి
Plane Crash: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్రెస్నో నగరంలో శనివారం మధ్యాహ్నం ఓ చిన్న విమానం అదుపుతప్పి నేలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో తీవ్రంగా క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం సమయంలో బ్లైత్ అవెన్యూలోని సియెరా స్కై పార్క్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఈ ప్రమాదం… -
Ramnagar Stampede: రాంనగర్ గణేష్ ఆగమన్ ర్యాలీలో విషాదం.. తొక్కిసలాటలో యువకుడు మృతి
Ramnagar Stampede: హైదరాబాద్‌లోని రాంనగర్ చౌరస్తాలో నిర్వహించిన గణేష్ ఆగమన్ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. వేలాది మంది యువకులు తరలివచ్చిన ఈ ర్యాలీలో తొక్కిసలాట జరగడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. డీజే చప్పుళ్ల మధ్య యువకులు డ్యాన్స్ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో రాంనగర్ చౌరస్తాలో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీ గణపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయకుడి ఆగమనం సందర్భంగా భారీ ఊరేగింపు నిర్వహించారు.… -
Times Square Stabbing: న్యూయార్క్‌లో కత్తితో మహిళ వీరంగం.. ఇద్దరిపై దాడి, పోలీస్ ఫైరింగ్‌లో హతం!
Times Square Stabbing: అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో సోమవారం మధ్యాహ్నం తీవ్ర కలకలం చోటుచేసుకుంది. ఓ మహిళ అకస్మాత్తుగా కత్తితో ఇద్దరిపై దాడి చేసింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా.. మరోకరు గాయపడ్డాడు. అనంతరం పోలీసులు ఆమెపై జరిపిన కాల్పుల్లో నిందితురాలు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం సుమారు 4:36 గంటలకు టైమ్స్ స్క్వేర్‌లో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో… -
Bangladesh: బంగ్లాదేశ్‌లో ఒకే హిందూ కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్య?
Bangladesh: బాంగ్లాదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రంగ్‌పూర్ నగరంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు తమ స్వగృహంలోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా దిగ్భ్రాంతికి గురిచేసింది. రిటైర్డ్ పాఠశాల ఉపాధ్యాయుడు, ఆయన భార్య, కుమార్తె, 12 ఏళ్ల కొడుకు మృతదేహాలు మూసి ఉన్న ఇంట్లోనే లభించాయి. ప్రాథమిక విచారణ ఆధారంగా ఈ నలుగురినీ గొంతు నులిమి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. చనిపోయిన వ్యక్తులు ఒకే హిందూ ఫ్యామిలీకి చెందిన వాళ్లు… -
Kolkata Hotel Fire: హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. తొమ్మిది మంది మృతి
Kolkata Hotel Fire: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నగరంలోని మీర్జా గాలిబ్ వీధిలో ఉన్న ఓ హోటల్లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు తొమ్మిది మంది మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. తెల్లవారుజామున 1:45 గంటలకు ఘటన పోలీసుల వివరాల ప్రకారం.. తెల్లవారుజామున సుమారు 1:45 గంటల సమయంలో హోటల్లో… -
AP Assembly Panel Speakers: ఏపీ అసెంబ్లీకి కొత్త ప్యానల్ స్పీకర్లు.. ఆరుగురి పేర్లు ప్రకటించిన స్పీకర్
AP Assembly Panel Speakers: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్యానల్ స్పీకర్లను స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. శాసనసభ కార్యకలాపాలను సజావుగా నిర్వహించడంలో భాగంగా ఆరుగురు సభ్యులను ప్యానల్ స్పీకర్లుగా నియమించారు. ప్యానల్ స్పీకర్లుగా మండలి బుద్ధ ప్రసాద్, కోళ్ల లలిత కుమారి, జ్యోతుల నెహ్రూ, విష్ణుకుమార్ రాజు, వరద రాజుల రెడ్డి, దాసరి సుధలను నియమించినట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. శాసనసభ సమావేశాల సమయంలో స్పీకర్ అందుబాటులో లేని సందర్భాల్లో సభా కార్యక్రమాలను నిర్వహించడంలో ప్యానల్ స్పీకర్లు కీలక… -
Omar Abdullah Divorce: విడిపోయిన సీఎం దంపతులు.. 17 ఏళ్ల ఎడబాటుకు సుప్రీంకోర్టు ముగింపు!
Omar Abdullah Divorce: జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆయన భార్య పాయల్ అబ్దుల్లా దాంపత్య బంధానికి అధికారికంగా ముగింపు పలికింది. దాదాపు 17 ఏళ్లుగా విడిగా జీవిస్తున్న ఈ దంపతులు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకోగా, వారి అభ్యర్థనకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. అలాగే ఒకరిపై ఒకరు దాఖలు చేసుకున్న అన్ని న్యాయపరమైన కేసులను ఉపసంహరించుకోవడానికి కూడా ఇరు పక్షాలు అంగీకరించాయి. ఈ కేసును జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ అలోక్ అరధే ధర్మాసనం… -
China: మళ్లీ కరోనా కలకలం.. చైనాలో 79 వేల కొత్త కేసులు.. భారత్‌కు డేంజరేనా?
China: చైనాలో మరోసారి కోవిడ్-19 కేసులు పెరుగుతున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2026లో తొలిసారిగా కరోనా వైరస్ వ్యాప్తి ఇన్ఫ్లుయెంజాను దాటేసి అత్యంత వేగంగా వ్యాపిస్తున్న శ్వాసకోశ వ్యాధిగా నమోదైంది. అయితే ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ మంది బాధితులకు స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయని, గత ఏడాది పరిస్థితులతో పోలిస్తే ఈసారి వైరస్ ప్రభావం తక్కువగానే ఉందని చైనా ఆరోగ్య అధికారులు వెల్లడించారు. జూన్‌లో 79 వేల కొత్త కేసులు చైనా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం…
తాజావార్తలు
-
Hyderabad: రాజేంద్రనగర్ పరిధిలో భారీ పేలుడు శబ్దం.. ఇళ్లపైకి పరుగులు తీసిన ప్రజలు.. అసలు ఏం జరిగింది?
-
AP Local Body Elections: నంద్యాలలో కలకలం.. సీపీఐ నేతల కిడ్నాప్‌కు టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి యత్నం!
-
OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
-
Ahaan Panday: 10 కథలు రిజక్ట్ చేసిన యువ హీరో.. చివరకు ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్!
-
Supreme Court Recruitment 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. రూ.2 లక్షలకు పైగా జీతం.. పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!