కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు భూ నిర్వాసితులను పట్టించుకోలేదని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిర్వాసితుల కష్టాల పైన అప్పటి మంత్రులు, బీఆర్ఎస్ నాయకులు ఏ నాడు మాట్లాడలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రైతులను బెదిరించి భూములు లాక్కున్నారని ఆయన వెల్లడించారు. నిర్వాసితులను కలవకుండా ప్రతిపక్ష నాయకులను హౌస్ అరెస్ట్ చేశారని, ఎకరం 30 లక్షల రూపాయల విలువ చేసే భూములను సరైన పరిహారం ఇవ్వకుండా లాక్కున్నారన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో రెండు వేల ఎకరాలను రైతుల…