భారత్‌కు చిరకాల మిత్రదేశమైన రష్యా అంతర్జాతీయ వేదికపై మరోసారి బాసటగా నిలిచింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించడంపై రష్యా తన మద్దతును ప్రకటించింది.
Moto G42 India launch has been tipped to take place as early as next week. The new Motorola phone was unveiled earlier this month and debuted in Brazil shortly after its official announcement.
సముద్రంలో ఎన్నో రకాల జీవులు నివశిస్తుంటాయి. సముద్రంలో చేపలు, తిమింగలాలు, డాల్ఫిన్‌లు ఉంటాయనే సంగతి తెలుసు. అయితే, మనకు తెలియని చాలా జలచర జీవాలు సముద్రంలో నివశిస్తుంటాయి. చాలా తక్కువగా మాత్రమే అలాంటి జీవులు బయటకు వస్తుంటాయి. సముద్రంలో షికారుకు వెళ్లిన ఓ వ్యక్తిని విచిత్రమైన జంతువు వెంబడించింది. దానిని చూసిన ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. వెంటనే బోటు వేగాన్ని పెంచాడు. బోటు వేగంతో పాటు ఆ విచిత్రమైన జంతువు కూడా వేగంగా ఆ బోటు…
బ్రెజిల్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బ్రెజిలియన్ సరస్సులో పడవలో ప్రయాణిస్తున్న ప్రయాణికులపై ఒక్కసారిగా పర్వతం కొండ చరియలు విరిగిపడిపోవడంతో ఏడుగురు మరణించారు. తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారని అగ్నిమాపక అధికారులు తెలిపారు. శనివారం ఆగ్నేయ బ్రెజిల్‌లోనిమినాస్ గెరైస్ రాష్ట్రంలోని కాపిటోలియో వద్ద ఉన్న సరస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక పెద్ద పర్వతం లోయ గోడ ఒక్కసారిగా పడవలపై పడింది. Read Also:వ్యవసాయంలో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలోఉంది: మంత్రి కన్నబాబు ప్రస్తుతం ఈ ఘటనకు…
కరోనా సెకండ్ వేవ్ సమయంలో బ్రెజిల్ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నది. ప్రజలు మాస్క్ పెట్టుకోనవసరం లేదని స్వయంగా ఆ దేశాధ్యక్షుడు బొల్సోనారో చెప్పడంతో మాస్క్ పెట్టుకోకుండా తిరిగారు. దీంతో ఆ దేశంలో కరోనా విలయతాండవం చేసింది. ఆ సమయంలో లక్షలాది మంది కరోనా బారిన పడ్డారు. వేలాది మంది చనిపోయారు. చేతులు కాలాక అకులు పట్టుకున్న చందాన, కరోనా మహమ్మారి విజృంభణ తరువాత మాస్క్ తప్పనిసరి చేశారు. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. అప్పటి నుంచి అధ్యక్షుడు…
సర్కస్‌లో తాడుపై నడవడం చూస్తూనే ఉంటాం. ఎత్తు పెద్దగా లేకుంటే తాడుపై నడిచినా ఏం కాదు. అదే రెండు బిల్డింగ్ మధ్య తాడును కట్టి నడవాలంటే వామ్మో అనేస్తాం. ఏమాత్రం తడబడినా, కాలు జారినా ఇక అంతే సంగతులు. అదే, గాలిలో రెండు హాట్ బెలూన్ల మధ్య తాడు కట్టి నడవాలి అంటే దానికి గడ్స్ ఉండాలని. గుండె దైర్యం ఉండాలి. ప్రాణాలపై ఆశలు వదిలేసుకొని సాహసం చేయాలి. అలా చేసినపుడే చరిత్ర సృష్టించగలుగుతారు. అసాధ్యమైన ఫీట్‌ను…
ప్రతి ఒక్కరికీ విమానంలో ఎక్కాలని ఉంటుంది. అయితే, అందరికీ అవకాశం రాకపోవచ్చు. విమానంలో ప్రయాణం టికెట్టు పెట్టుకుంటే, కుటుంబం మొత్తం కలిసి రైళ్లో హాయిగా ప్రయాణం చేయవచ్చు. అందుకే రైళ్లు ఎప్పుడూ కిటకిటలాడుతుంటాయి. విమానంలో ఎలాగైనా ఎక్కాలనే కోరిక ఉన్న ఓ వ్యక్తి ఏకంగా వినానాన్నే తయారు చేశాడు. దీనికోసం కొన్ని పాత వాహనాలను కొనుగోలు చేసి వాటి సహాయంతో విమానం తయారు చేశారు. ఈ విమానాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఆ ప్రాంతానికి చేరుకున్నారు.…
బ్రెజిల్‌లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. గడచిన 24 గంటల్లో 12,930 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని ఆ దేశ ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా కేసుల 22,043,112 సంఖ్యకి చేరింది. ఇక మంగళవారం ఒక్కరోజే 273 మంది కరోనాతో మృతి చెందగా… మొత్తం మరణాల సంఖ్య 613,339కి చేరింది. ఇక బ్రెజిల్‌లో గత ఏడురోజుల్లో సగటున 9,350మంది కరోనా బారినపడ్డారని, 213 మంది మరణించారని అక్కడి ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. లక్షలాది మంది నివసించే…
మనదగ్గర ఒట్టిపోయిన ఆవులను కబేళాకు తరలించి వధిస్తుంటారు. అయితే, కొన్ని దేశాల్లో ఆవులను కేవలం ఆహారం కోసమే పెంచుతుంటారు. ఇలానే ఓ వ్యక్తి ఆవును కబేళాకు తరలించాడు. అక్కడ దానిని వధించేందుకు సిద్ధం కాగా వారి కళ్లుకప్పి ఆ గోవు అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వచ్చింది. అక్కడే ఉంటే పట్టుకుంటారని భావించిన ఆ గోవు 800 కిలోమీటర్ల దూరం పారిపోయింది. ఈ సంఘటన బ్రెజిల్‌లోని రియోడి జెనెరియోలో చోటుచేసుకుంది. Read: ఉత్కంఠభరితంగా సాగిన బ్రెజిల్-…
ఖతర్ వేదికగా వచ్చే ఏడాది ఫిఫా వరల్డ్ కప్ 2022 జగరబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రపంచ కప్‌లో పాల్గొనేందుకు అనేక దేశాలు పోటీ పడుతుంటాయి. దక్షిణ అమెరికా టాప్ 10 లో బ్రెజిల్ 35 పాయింట్లు సాధించి నెంబర్ 1 స్థానంలో నిలవగా, అర్జెంటైనా 29 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటికే బ్రెజిల్ ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది. ఇక ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లో భాగంగా బ్రెజిల్-అర్జెంటైనా జట్ల మధ్య ఈరోజు మ్యాచ్ జరిగింది.…