సముద్రంలో ఎన్నో రకాల జీవులు నివశిస్తుంటాయి. సముద్రంలో చేపలు, తిమింగలాలు, డాల్ఫిన్‌లు ఉంటాయనే సంగతి తెలుసు. అయితే, మనకు తెలియని చాలా జలచర జీవాలు సముద్రంలో నివశిస్తుంటాయి. చాలా తక్కువగా మాత్రమే అలాంటి జీవులు బయటకు వస్తుంటాయి. సముద్రంలో షికారుకు వెళ్లిన ఓ వ్యక్తిని విచిత్రమైన జంతువు వెంబడించింది. దానిని చూసిన ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. వెంటనే బోటు వేగాన్ని పెంచాడు. బోటు వేగంతో పాటు ఆ విచిత్రమైన జంతువు కూడా వేగంగా ఆ బోటు వైపు దూసుకొచ్చింది. అది నీళ్లల్లో నుంచి బయటకు వచ్చినపుడు కళ్లు చింతనిప్పుల్లా ఎర్రగా ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియోను సదరు వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. కాగా, ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ సంఘటన బ్రెజిల్‌లో జరిగింది.
Read: 2021లో భారీగా పెరిగిన స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు… ప్రతిగంటకు…
Criatura misteriosa perseguiu um barco ontem no Rio Grande do Sul.
— Pedrohenriquetunes (@PedroHTunes) January 27, 2022
Segue o fio para descobrir que monstro é esse nessa #BioThreadBr pic.twitter.com/chOfZ5d0VK