కరోనా నిబంధనలను తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. నేను దేశాధ్యక్షుడిని నాకు ఈ రూల్స్ వర్తించవు అంటే కుదరదు. అధ్యక్షులైనా సరే నిబంధనలు పాటించకుంటే ఇదిగో ఇలా జరిమానా కట్టాల్సి ఉంటుంది. కరోనా మహమ్మారి నుంచి బ్రెజిల్ ఇంకా కోలుకోలేదు. మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నది. ప్రజారోగ్యంపై దృష్టిసారించినప్పటికీ కేసులు, మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. కరోనా విజృంభిస్తున్న సమయంలో అభివృద్ధి ఆగిపోతుందనే పేరుతో పెద్దగా పట్టించుకోలేదు. ఒక్కసారిగా కరోనా విలయతాండవం చేయడంతో హడావుడిగా లాక్‌డౌన్ వంటివి చేసినప్పటికీ…