ఏఐతో అద్భుతాలు ఆవిష్కృతమవుతున్న వేళ కొంతమంది ప్రజలు మూఢనమ్మకాలనే విశ్వసిస్తున్నారు. అనారోగ్యానికి గురైనా, ఆపదలు వచ్చినా ఎవరో తమకు బాణామతి చేశారని అందుకే ఇలా అయ్యిందని ఆందోళన చెందుతున్నారు. మూఢనమ్మకాలపై ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో అడ్డుకట్టపడడం లేదు. తాజాగా ఒడిషాలో దారుణ ఘటన వెలుగుచూసింది. నెల రోజుల వయసున్న శిశువు అనారోగ్యానికి గురికాగా.. జబ్బు నయం కావడానికి ఆస్పత్రికి తీసుకెళ్లాల్సింది పోయి ఒంటిపై ఇనుపరాడ్డుతో వాతలు పెట్టారు. ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది.…