దసరా శరన్నవరాత్రులు ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నాడు ప్రారంభమై ఆశ్వీయుజ శుద్ధ దశమి తో పూర్తవుతాయి. ఒక్కోరోజు ఒక్కో అవతారం ఎత్తి మహిషాసురుడు అనే రాక్షసుడిని అమ్మవారు సంహరించింది.. ఆ తర్వాత విజయానికి సంకేతంగా దసరా పండుగను జరుపుకుంటాం. అమ్మవారు వెలిసిన ప్రాంతాన్ని బట్టి అమ్మవారిని పలు అవతారాల్లో పూజిస్తారు.. శరన్నవరాత్రుల్లో ప్రజలు అత్యంత భక్తి నిష్టలతో దుర్గామాతను పూజిస్తారు. రోజుకో అలంకరణతో అమ్మవారికి ఇష్టమైన పుష్పాలతో పూజిస్తారు. నైవేద్యాలు పెడతారు. దసరా నవరాత్రి ఉత్సవాలు మూడు…