దసరా శరన్నవరాత్రులు ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నాడు ప్రారంభమై ఆశ్వీయుజ శుద్ధ దశమి తో పూర్తవుతాయి. ఒక్కోరోజు ఒక్కో అవతారం ఎత్తి మహిషాసురుడు అనే రాక్షసుడిని అమ్మవారు సంహరించింది.. ఆ తర్వాత విజయానికి సంకేతంగా దసరా పండుగను జరుపుకుంటాం. అమ్మవారు వెలిసిన ప్రాంతాన్ని బట్టి అమ్మవారిని పలు అవతారాల్లో పూజిస్తారు.. శరన్నవరాత్రుల్లో ప్రజలు అత్యంత భక్తి నిష్టలతో దుర్గామాతను పూజిస్తారు. రోజుకో అలంకరణతో అమ్మవారికి ఇష్టమైన పుష్పాలతో పూజిస్తారు. నైవేద్యాలు పెడతారు.
దసరా నవరాత్రి ఉత్సవాలు మూడు రోజుకు చేరుకున్నాయి.. ఈరోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణ దేవి అలంకరణ లో దర్శనం ఇవ్వనున్నారు.. సకల జీవులకు అన్నం ఆధారం. కాశీ విశ్వేశ్వరుడి ప్రియ పత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతోంది. అన్నపూర్ణాదేవిని పూజిస్తే తిండికి లోటుండదు. సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈరోజు అమ్మవారిని పూజించిన వారికి ఆకలిదప్పులు వంటి బాధలు ఉండవని చెబుతారు. అన్నపూర్ణా దేవి ఈరోజు గంధం రంగు చీరలో దర్శనం ఇస్తారు. తెల్లని పుష్పాల తో పూజిస్తారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్ధోజనం నైవేద్యం పెడతారు. ఈరోజు అన్నదానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.. అమ్మవారిని ఆ అలంకరణలో చూసేందుకు భక్తులు వేలాదిగా ఆలయానికి వస్తున్నారు.. రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతుందని ఆలయ అధికారులు చెబుతున్నారు..