Brain-Eating Amoeba: కేరళ రాష్ట్రాన్ని అరుదైన ప్రాణాంతక ‘‘మెదడును తినే అమీబా’’ ఇన్ఫెక్షన్ భయపెడుతోంది. కలుషిత నీటిలో ప్రత్యక్ష సంబంధం ద్వారా ఈ అమీబా ముక్కు ద్వారా మానవ శరీరంలోకి చేరి చివరకు ప్రాణాలను తీస్తుంది. నేగ్లేరియా ఫౌలేరీ అనే అమీబా వల్ల ‘‘అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్’’ అనే ఇన్ఫెక్షన్ సోకుతుంది.