రెండవ దశ ప్రజా సంగ్రామ యాత్రను నేడు అలంపూర్ జోగులంబ నుంచి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రారంభించనున్నారు. అయితే నేడు డా.బీఆర్ అంబేద్కర్ 131 జయంతి సందర్భంగా జోగులాంబ జిల్లాలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. అంబేద్కర్ పెట్టిన భిక్ష వల్లే తాను ప్రధాని అయ్యానని మోడీ చెప్పారన్నారు. అంబేద్కర్‌కి భారత రత్న ఇచ్చి గౌరవించిన పార్టీ బీజేపీ అని ఆయన కొనియాడారు.…
అసెంబ్లీలోని ప్రాంగణంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కవితతో పాటు ఇతర ఎమ్మెల్సీలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఫెడరల్ వ్యవస్థ దెబ్బ తింటోందని ఆయన వ్యాఖ్యానించారు. దీని వల్ల రాష్ట్రాల హక్కులను కేంద్రం లాక్కుంటోందని ఆయన ఆరోపించారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన మండిపడ్డారు. ఈ దేశానికి…