ఆర్టీసీ బస్సుల్లో ఫుట్‌బోర్డు ప్రయాణం ప్రమాదకరం. ఫుట్‌బోర్డు దగ్గర ఎవరూ నిలబడొద్దని కండక్టర్ హెచ్చరిస్తుంటాడు. బస్సు ఎక్కే ప్రయాణికులకు ఇబ్బంది ఉండకూడదని.. అలాగే ఫుట్‌బోర్డు ప్రమాదకరమని కండక్టర్లు హెచ్చరిస్తుంటారు. ఈ మాటే ఒక వ్యక్తికి రుచించలేదు. కండక్టర్ ఆ మాట అన్నందుకు ఏకంగా హత్య చేసేందుకు రెడీ అయ్యాడు.