ప్రేమ పేరుతో ఓ యువతిని ప్రేమించాడు. పెళ్లి పేరుతో యువతితో శారీరక సంబంధం కూడా ఏర్పరచుకున్నాడు. తీరా ఆ అమ్మాయిని మోసం చేసి మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. అయితే ఇంతలో ప్రియురాలు ఓ ట్విస్ట్ ఇచ్చింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించింది.