మరో హృదయవిదారక ఘటన. దేశంలో ప్రభుత్వం ఆస్పత్రులు, సదుపాయాలను ప్రశ్నించే ఘటన. పేదోళ్లకు కనీస వైద్యం, సౌకర్యాలు అందుతున్నాయో లేదో తెలిపే ఓ సన్నివేశం. ప్రస్తుతం దేశంలో వైరల్ గా మారింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఘటన యావత్ దేశాన్ని ప్రశ్నిస్తోంది. రెండేళ్ల తన సోదరుడి శవాన్ని ఒడిలో పెట్టుకుని రోడ్డు పక్కన, మురికి పరిసరాల్లో కూర్చున్న ఎనిమిదేళ్ల బాలుడి ఘటన దేశ వ్యాప్తంగా అందరి మనుసుల్ని కదిలిస్తోంది. తన ఒళ్లో తమ్ముడి శవాన్ని పెట్టుకుని, ఈగలు…