ప్రశాంత్ కిషోర్, ఎన్నికల కన్సల్టెన్సీలపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మా.. ప్రశాంత్ కిషోర్ ఓ క్యాష్ పార్టీ అంటూ ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు.
పచ్చ కామెర్లు ఉన్న వాడికి ఊరంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్లు ఉంది చంద్రబాబు వ్యవహారం ఉందని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఎందుకు 23 స్థానాలకు పరిమితం అయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. దశల వారీగా మద్యం నియంత్రణ చేస్తాం అన్నాం.. బెల్టు షాపులు తీస్తాం అన్నాం తీశామని మంత్రి పేర్కొన్నారు.