Fake Bomb Threats: దేశంలో గత 10 రోజులుగా విమానయాన రంగాన్ని నకిలీ బాంబు బెదిరింపులు భయపెడుతున్నాయి. 10 రోజుల్లో 250కి పైగా విమానాలు బెదిరింపులుకు గురయ్యాయి. డొమెస్టిన్‌తో సహా ఇంటర్నేషనల్ రూట్లలో నడిచే విమానాలపై ప్రభావం పడింది. ఈ నకిలీ బెదిరింపుల ఫలితంగా విమానయాన రంగం కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. చాలా వరకు ఈ నకిలీ బెదిరింపులు సోషల్ మీడియా వేదికగా వచ్చాయి.