దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి పాఠశాలలకు బాంబ్ బెదిరింపులు కలకలం రేపాయి. పలు పాఠశాలలకు శనివారం ఉదయం బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. తెల్లవారుజామున ఈ బెదిరింపులు రావడంతో పాఠశాల యాజమాన్యాలు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని మూడు విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. హైదరాబాద్ నుండి చెన్నై వెళ్లాల్సిన రెండు ఇండిగో విమానాలు, చెన్నై నుండి హైదరాబాద్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానాలకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సీఐఎస్‌ఎఫ్ వర్గాలు అప్రమత్తమయ్యాయి.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపుతున్నాయి. ఇటీవల కాలంలో వరుసగా ఈ మెయిల్ బెదిరింపు కాల్స్ రావడం అధికారుల్ని పరుగులు పెట్టిస్తోంది. మరోవైపు ప్రజలు కూడా బెంబేలెత్తిపోతున్నారు.