God Father:ఇద్దరు మెగాస్టార్స్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి ఒకే ఫ్రేమ్ లో తొలిసారి కనిపించబోతున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ మూవీస్ సంయుక్తంగా తెరకెక్కిస్తోన్న 'గాడ్ ఫాదర్' సినిమాలో ఈ విజువల్ ట్రీట్ చోటు చేసుకుంది.
కండల వీరుడు సల్మాన్ ఖాన్ పైకి ఎంత రూడ్ గా కనిపించినా.. ఎన్ని వివాదాలలో చిక్కుకున్న ఆయన మనసు వెన్న.. ఒక్కసారి ఎవరినైనా తన స్నేహితుడు అనుకున్నాడు అంతే లైఫ్ లాంగ్ ఆ స్నేహాన్ని కొనసాగిస్తాడు. ఇక ఆ రిలేషన్ కోసం ఏదైనా చేస్తాడు.. తాజాగా మరోసారి సల్మాన్ తన స్నేహ బంధాన్ని నిరూపించాడు. సల్మాన్ ఖాన్ కి, మెగా ఫ్యామిలీకి మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. చిరంజీవి అంటే ఆయనకు అమితమైన…