బుల్లితెరలో అత్యంత ప్రజాదరణ పొందిన సూపర్ హీరో సీరియల్ ‘శక్తిమాన్’! ముఖేష్ ఖన్నా శక్తిమాన్ గా నటించిన ఈ ధారావాహిక దేశవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షకులను ఆకట్టుకుంది. పలుభాషలలో అనువాదమై చిన్నాలను అలరించింది. ఇప్పుడు సోనీ పిక్చర్స్ సంస్థ దీనిని మూడు భాగాల సినిమాగా నిర్మించబోతోంది. ఆ సీరియల్ ను సినిమాగా రూపొందించే హక్కులన్ని సోనీ పిక్చర్స్ సొంతం చేసుకుంది. దేశంలోని ప్రముఖ సూపర్ స్టార్స్ లో ఒకరు శక్తిమాన్ గా వెండితెరపై కనిపించబోతున్నారని, ఓ ప్రముఖ…
దేశ వ్యాప్తంగా బుల్లితెర వీక్షకులను అలరించిన ‘మహాభారత్’ సీరియల్ లో భీముడి పాత్రను పోషించిన ప్రవీణ్ కుమార్ సోబ్తి (75) సోమవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. బీఆర్ చోప్రా రూపొందించిన ‘మహాభారత్’ సీరియల్ ఆయనకు నటుడిగా చక్కని గుర్తింపు తెచ్చిపెట్టింది. ‘తన తండ్రి సోమవారం రాత్రి 9.30 లకు ఢిల్లీలోని నివాసంలో గుండెపోటుతో మరణించార’ని ఆయన కుమార్తె నికుణిక తెలిపింది. కేవలం బుల్లితెర నటుడిగానే కాకుండా అమితాబ్ ‘షెహన్ షా’, ధర్మేంద్ర ‘లోహా’తో పాటు ‘ఆజ్ కా…