నందమూరి నట వారసుడిగా, ఎన్టీఆర్ మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ పై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఎన్టీఆర్ కూడా తాత పేరును నిలబెడుతూ స్టార్ హీరోగా ఎదుగుతూ అభిమానుల అంచనాలకు తగ్గకుండా తన నటనతో వారిని ఆనందింప చేస్తున్నాడు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే తెలుగుదేశం పార్టీకి వారసుడిగా ఎప్పుడు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడు అనేది ఇటు ఇండస్ట్రీలోనూ, అటు రాజకీయ పెద్దలలోనూ ఆసక్తిరేపుతున్న విషయం. అప్పుడు వస్తాడు .. ఇప్పుడు వస్తాడు..…