అందాలు ఆరబోయడంలోనూ, అందుకు తగ్గ అభినయం ప్రదర్శించడంలోనూ కంగనా రనౌత్ సదా అభినందనలు అందుకుంటూనే ఉంటుంది. అంతలేంది… జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలుస్తుందా చెప్పండి! కేవలం నటనతోనే కాదు, తనకు చాలాకాలంగా అలవాటయిన వెటకారంపైనా కంగనాకు ఎంతో మమకారం ఉందని మరోమారు తేలిపోయింది. అవకాశం చిక్కితే చాలు తారల వారసులపై వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో కంగనా ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా అనన్య పాండేపై కంగనా ఓ సెటైర్ వేసి మళ్ళీ వార్తల్లో నిలచింది. చాలా రోజులుగా ‘నెపోటిజమ్’పై…