Srisailam: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానంలో ప్రమాదం తప్పింది. అన్నపూర్ణ భవన్‌లో అల్పాహారం తయారీకి ఉపయోగించే బాయిలర్ పేలింది. పేలుడు ధాటికి బాయిలర్‌లోని ఎస్ఎస్ ట్యాంక్ ఎగిరిపడింది. ఘటనాస్థలిలో సిబ్బంది లేకపోవడంతో ప్రమాదం తప్పింది. నిత్యాన్నదానం నిర్వహించే చోట ఈ ప్రమాదం జరిగింది. స్టీమింగ్ బాయిలర్ బాగా వేడేక్కడంతో పేలిపోయినట్టుగా అక్కడ పనిచేసే సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. ఈ బాయిలర్ పేలుడు కారణంగా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా దేవస్థానం…