ఎట్టకేలకు ప్రకాశం బ్యారేజీ వద్ద భారీ బోటు తొలగింపు ప్రక్రియ విజయవంతమైంది. ఓ భారీ బోటును బయటకు తీయగలిగారు. ప్రకాశం బ్యారేజీ గేట్ల దగ్గర నీటిలో చిక్కుకున్న 40 టన్నుల బరువున్న భారీ బోటును బెకెం ఇన్‌ఫ్రా సంస్థ ఇంజినీర్లు విజయవంతంగా ఒడ్డుకు చేర్చారు.
ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లను తొలగించేందుకు H బ్లాక్ ఆపరేషన్ ప్రారంభమైంది. నీళ్లలో నుంచి బోట్లను తొలగించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్‌కు అడ్డం పడిన బోట్ల తొలగింపు.. రోజురోజుకు క్లిష్టంగా మారుతోంది.
Prakasam Barrage: విజయవాడలోని ప్రకాశం బ్యారేజీలో చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియ ఆరవ రోజు కొనసాగుతుంది. డబుల్ ఐరన్ రోప్ పను డోజర్ కు కనెక్ట్ చేసి బోట్లను లాగే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న లోడ్ హెవీ కావడంతో లోడ్ యాక్సిల్ విరిగిపోయింది. ఇవాళ సరాసరి భూమిలోకి వేసిన స్తంభానికి కనెక్ట్ చేసి డోజర్ తో లాగే ప్రయత్నం చేస్తున్నారు.