మహారాష్ట్ర తీరంలోని ఓ పాడుపడిన పడవలో మూడు ఏకే-47 రైఫిళ్లు, బుల్లెట్లు, పత్రాలు లభ్యం కావడం కలకలం రేపింది. తీరానికి కొట్టుకొచ్చిన ఆ బోటులో ఏకే-47 తుపాకులు లభ్యం కావడంతో ఉగ్రకోణంలో భయాందోళనలు నెలకొన్నాయి. దీనిపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు.