Caffeine: కాఫీ అతిగా తాగితే అనర్థాలు ఉంటాయని పలు అధ్యయనాల్లో తేలింది. అయితే కాఫీలో ఉండే కెఫిన్ వల్ల ఊబకాయం, డయాబెటిస్ వంటివి వచ్చే ప్రమాదం తగ్గిస్తుందని తాజా అధ్యయనం కనుగొంది. అధిక స్థాయిలో కెఫిన్ తీసుకోవడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గుతుందని, టైప్ 2 డయాబెటిస్ తో పాటు గుండె సంబంధిత వ్యాధుల రిస్క్ తగ్గుతుందని అధ్యయనం పేర్కొంది.