తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో తొలిసారిగా సినిమాలపై జరుగుతున్న డిజిటల్ మానిప్యులేషన్, ఆన్‌లైన్ దుష్ప్రచారాన్ని అడ్డుకునే దిశగా కీలక అడుగు పడింది. కోర్టు ఆదేశాల మేరకు ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాకు సంబంధించి టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌లలో రేటింగ్స్, రివ్యూలను చట్టబద్ధంగా నియంత్రించేలా చర్యలు చేపట్టారు. దాంతో నిజమైన ప్రేక్షకుల తీర్పుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా, కావాలని చేసే దుష్ప్రచారానికి బ్రేక్ పడినట్లయింది. ఇది ఇప్పటివరకు ఎప్పుడూ లేని వినూత్న నిర్ణయంగా సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.…