ఈ వైరల్ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తికి కూడా అలాంటి నైపుణ్యం ఉంది. ముందున్న లక్ష్యాన్ని చూడకుండా చేధిస్తాడు. ఆ వ్యక్తి కళ్లకు గంతలు కట్టుకుని, చేతిలో స్లింగ్‌షాట్‌తో ఉండటాన్ని వీడియోలో చూడవచ్చు. అతను స్లింగ్‌షాట్‌తో సైకిల్ చక్రానికి జోడించిన బాటిల్‌ను లక్ష్యంగా చేసుకుని, ఒక్కసారిగా బాటిల్‌ను పగలగొట్టాడు.