Revanth Reddy: మునుగోడు ఉప ఎన్నిక కు బీజేపీ 5 వేల కోట్లు కేటాయిస్తే అక్కడి సమస్యలు తీరుతాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచళన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా సమస్యల ప్రాతిపదికన జరగాల్సిన చర్చ వ్యక్తిగత విమర్శలు దారితీస్తుందని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ వల్ల గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర ధరలు భారీగా పెరిగాయని మండిపడ్డారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని…
కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాతో టచ్ లో ఉన్నాడని నేను ఎప్పుడు అనలేదని బండి సంజయ్ స్పష్టం చేసారు. యాదాద్రి జిల్లా మోత్కూర్ లో మీడియా చిట్ చాట్ లో మాట్లాడిన ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాతో టచ్ లో ఉన్నాడని నేను ఎప్పుడు అనలేదని, ఆయన చాలా మంచి పొలిటికల్ లీడర్ అని చెప్పుకొచ్చారు. బీజేపీ ప్రభుత్వం ఈడీ ని వాడుకోవాలని చూస్తే తెలంగాణలో ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే కూడా మిగలడని హెచ్చరించారు. మునుగోడు ఉప…
Bandi Sanjay: పోస్టర్లు వేయడం మేము మొదలుపెడితే టిఆర్ఎస్, కాంగ్రెస్ లు తట్టుకోలేవని బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. యాదాద్రి జిల్లా పొడిచెడు గ్రామం వద్ద ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్, రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిసిన విషయంపై ఎన్టీవీతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు ఎంతకు అమ్ముడుపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లోకి వెళ్లిన నేతలు ఎంత తీసుకున్నారని ప్రశ్నల…
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ దిశగా చర్యలు చేపట్టాకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. రాజమండ్రిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన… ఆజాదీ కా అమృత మహోత్సవాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొక్కుబడిగా నిర్వహిస్తోందన్నారు.. మహనీయులను స్మరించడం మానుకొని, సాంస్కృతిక శాఖ మంత్రి రోజా సొంత ప్రచారం చేసుకుంటున్నారు.. ఇప్పటికైనా మానుకోవాలని సూచించిన ఆయన.. అనవసరమైన వాటికి రాష్ట్ర ప్రభుత్వం దుబారా ఖర్చులు చేస్తోందని.. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి,…
Actor Sanjay Raichura joined BJP: తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ అసెంబ్లీకి మరో ఏడాదిన్నరలో ఎన్నికలు రాబోతున్న తరుణంలో రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని అనుకుంటోంది. దీనికి తగ్గట్లుగానే తన కార్యాచరణను అమలు చేస్తోంది. బీజేపీలోకి ఇతర నాయకులను చేర్చుకునేందుకు ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది.
‘‘హర్ ఘర్ తిరంగా జెండా‘‘ కార్యక్రమంలో భాగంగా అమ్మనబోలులోని ప్రజా సంగ్రామ యాత్ర శిబిరం వద్ద మువ్వన్నెల జాతీయ పతాకాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. దేశ భక్తి పాటలు, స్వాతంత్ర సమరయోధుల వీరోచిత పోరాటాల గీతాల ఆలాపనతో పాదయాత్ర శిబిరం సందడిగా మారింది. ఆజాదీ కా అమ్రుత మహోత్సవ్ లో భాగంగా 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకుని ఆగస్టు 15న వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించే విషయంలో ప్రతి…
India Today Survey: మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే నిర్వహించిన లేటెస్ట్ సర్వేలో దేశంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రజలు మరోసారి మోదీకే పట్టం కడతారని స్పష్టమైంది. అయితే 2019లో వచ్చిన సీట్ల కంటే బీజేపీకి మెజారిటీ తగ్గుతుందని ఇండియా టుడే-సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. బీజేపీకి 2019 ఎన్నికల్లో 303 సీట్లు వచ్చాయి. కానీ వచ్చే ఎన్నికల్లో బీజేపీ 286 సీట్లకే పరిమితం అవుతుందని సర్వే అంచనా వేసింది. గత…
తన రాజీనామా దెబ్బకు రాష్ట్రంలో 10 క్షల మందికి పెన్షన్స్ వచ్చాయని రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన రాజీనామా ద్వారా ప్రభుత్వంలో కదలిక మొదలయ్యిందని ఎద్దేవ చేసారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని నేను పోరాడుతున్న విషయం అందరికి తెలుసని అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్స్ లను విధుల్లోకి తీసుకోవడం కూడా నా రాజీనామా ఫలితమే అని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తన రాజీనామా ఊరికే పోలేదని హర్షం వ్యక్తం చేసారు. ప్రభుత్వ యంత్రాంగం మునుగోడుకు…