ఉప ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ త్వరలో బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. బీజేపీలో చేరేందుకు డేట్ ఫిక్స్ అయినట్లు సమాచారం. అక్టోబర్ 19న ఢిల్లీలో బీజేపీ నేతల సమక్షంలో బూర నర్సయ్య గౌడ్ కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. బీజేపీలో చేరడం ఘర్ వాపసీ లాంటిదని.. పదవుల కోసం పార్టీ మారడం లేదని బూర నర్సయ్య గౌడ్ చెప్పారు.
బీజేపీ కేంద్రంలో దోపిడీ చేసిన సొమ్ము మునుగోడులో పెడుతున్నారని అన్నారు. మునుగోడు ఓటర్లు తెలివైన వారని, మునుగోడు ప్రజల్ని ఎవరు కొనలేరని అన్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
మునుగోడు ప్రచారంలో భాగంగా.. సీఎల్పీ నేత బట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మునుగోడులో జరుగుతున్న తీరుపై వీడియో క్లిప్పింగ్ ప్రదర్శించామన్నారు. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ , బీజేపీ రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలను విచ్చలవిడిగా ఊపయోగిస్తున్నాయని అన్నారు.
గుజరాత్పై మార్పు తుఫాన్ దూసుకుపోతోందని. తమ పార్టీ తదుపరి ప్రభుత్వా్న్ని ఏర్పాటు చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
ఓ వైపు విశాఖ గర్జన.. మరోవైపు జనసేనాని పవన్ కల్యాణ్ పర్యటన.. విశాఖపట్నంలో ఉద్రిక్తతలకు దారి తీసింది.. విశాఖ ఎయిర్పోర్ట్కు పవన్ కల్యాణ్ చేరుకున్న సమయంలో.. గర్జనను ముగించుకుని ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు మంత్రి జోగి రమేష్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. అయితే, వారి కాన్వాయ్పై రాళ్లతో, కర్రలతో దాడి చేసినట్టు వైసీపీ ఆరోపిస్తుంది.. ఈ దాడిలో.. ఇద్దరు వైసీపీ కార్యకర్తలకు గాయాలు కాగా.. కారు అద్దాలు ధ్వంసమైనట్టు చెబుతున్నారు.. అయితే, ఈ దాడిపై స్పందించిన బీజేపీ…