లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీయే కూటమికి క్లియర్ కట్ మెజార్టీ రావడంతో ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తును స్టార్ట్ చేసింది. కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో ఇవాళ ( బుధవారం) సమావేశం కావాలని నిర్ణయించింది.
దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తె, భారతీయ జనతా పార్టీకి చెందిన బన్సూరి స్వరాజ్ విజయం సాధించారు. న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన ఆమె.. 78,370 ఓట్ల తేడాతో ఆప్‌కి చెందిన సోమనాథ్ భారతిపై విజయం సాధించారు. ఔట్‌గోయింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి స్థానంలో తొలిసారిగా ఎమ్మెల్యే బన్సూరిని బీజేపీ రంగంలోకి దించింది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలను గెలుచుకున్న బీజేపీ.. మూడోసారి అదే ఫార్ములా…
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వరుసగా మూడోసారి గెలిచారు. నాగ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన.. తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థిపై 1,37, 603 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కాగా.. కాంగ్రెస్ అభ్యర్థి వికాస్ ఠాక్రేకు 5,17,424 ఓట్లు రాగా, నితిన్ గడ్కరీకి 6,55,027 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థి యోగేశ్ లంజేవార్ 19,242 ఓట్లతో మూడో స్థానంలో నిలవగా.. నోటాకు 5,474 ఓట్లు వచ్చాయి.
Lok Sabha Election Results 2024, bjp, Elections Results, Elections Results 2024, INDIA Bloc, Lok Sabha Elections Results, Lok Sabha elections-2024, NDA, PM Modi, Lok Sabha Election Results 2024 LIVE UPDATES
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్.. బీజేపీ అభ్యర్థి సీఎన్ మంజునాథ్ చేతిలో ఓటమిపాలయ్యారు. దీంతో.. కర్ణాటకలో అధికార పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాగా.. డీకే సురేష్ బెంగళూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కర్ణాటకలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన ఏకైక కాంగ్రెస్ అభ్యర్థి అయిన మూడుసార్లు ఎంపీగా గెలిచిన శివకుమార్‌కు ఎదురుదెబ్బ అనే చెప్పవచ్చు.
నేడు వెలుబడిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి నారా లోకేష్ పలు వ్యాఖ్యలు చేసారు. ఇందులో భాగంగా ప్రజలు అద్భుతమైన విజయాన్ని అందించారని., ఈ విజయంతో మా బాధ్యత మరింత పెరిగిందని ఆయన పేర్కొన్నాడు. అలాగే వారిలాగా తాము కక్షలు సాధించే ప్రభుత్వం మాది కాదని ఆయన తెలిపారు. అలాంటి ప్రభుత్వం నడిపే ఉద్దేశం మాకు లేదని చెప్పుకొచ్చారు. వాళ్లు చేసిన పొరపాట్లు తాము చేయుమని.. మాది ఒకే రాజధాని సిద్ధాంతమని లోకేశ్ పేర్కొన్నారు. Anam…
లోక్‌సభ ఎన్నికల ఫలితాల పైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పార్టీ స్థాపించి 24 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో అన్ని రకాల ఎత్తుపల్లాలను చూశామన్నారు. అద్భుతమైన విజయాలతో పాటు అనేక ఎదురుదెబ్బలు, ఎదుర్కొన్నామన్నారు.
ఉత్తర ప్రదేశ్ అమేథీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీ లాల్ శర్మపై ఓడిపోయారు. మొదటి రౌండ్ నుంచి ఇక్కడ ఆమె వెనుకంజలోనే కొనసాగారు. గతంలో కాంగ్రెస్‌కు కంచుకోటగా భావించే అమేథిలో స్మృతి ఇరానీ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఓడించారు. దీంతో ఈసారి కాంగ్రెస్ అధిష్ఠానం వ్యూహాత్మకంగా ఇందిరా గాంధీ కుటుంబానికి విధేయుడైన కిశోరీ లాల్ శర్మను అమేథీ నుంచి బరిలోకి దింపింది. ఇక అమేథీ నుంచి గెలుపు ఖాయమని మొదటి…
లోక్‌సభ ఎన్నికల్లో చాలా ఎగ్జిట్ పోల్ పూర్తిగా విఫలమయ్యాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌ను తోసిపుచ్చాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి 350కి పైగా సీట్లు వస్తాయని అంచనా వేశాయి. కాని అసలు ఫలితాల్లో బీజేపీకి సొంతంగా మెజారిటీ వచ్చేలా కనిపించడం లేదు.
బీజేపీ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చి.. నైతికంగా తాము గెలిచామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సారి చెప్తున్నాం.. గెలుపు ఓటములు సహజమన్నారు. కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.