Bihar Elections 2025: బీహార్ రాష్ట్రం గోపాల్‌గంజ్ జిల్లాలోని బైకుంత్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల అనంతరం.. హింస చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిధవాలియా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని బుచెయా గ్రామంలో ఒక దళిత కుటుంబంపై తీవ్రంగా దాడి చేశారు. బాధితుల ప్రకారం.. ఓటు వేసిన తర్వాత ఇంటికి తిరిగి వస్తుండగా కొంతమంది వారిని ఆపి బీజేపీకి ఓటు వేశారని ఆరోపిస్తూ కొట్టారు. ఈ సంఘటనలో ముగ్గురు గాయపడ్డారు. చికిత్స కోసం సదర్…
రేపు హెచ్‌సీఏ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే, అసెంబ్లీ ఎన్నికలను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు తలపిస్తున్నాయి. పోటా పోటీగా ప్రెస్ మీట్ లు, ఒకరిపై ఒకరు ఆరోపణల పర్వం చేసుకుంటున్నారు. దీంతో హెచ్‌సీఏ ఎన్నికలకూ రాజకీయ రంగు పులుముకుంది. బీఆర్ఎస్-బీజేపీ మద్దతుదారుల మధ్య పోటీ కొనసాగుతుంది.
తమ నేతపై ఎవరైనా ఆరోపణలు చేసినా.. విమర్శలు చేసినా.. వారి ఫాలోవర్స్‌కి ఎంతో కోపం వస్తుంది.. కొన్నిసార్లు అది కట్టలు తెచ్చుకునేవరకు వెళ్తుంది.. అలాంటి ఘటనే ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిపోయింది.. ఆ ఘటన పశ్చిమ బెంగాల్‌లో జరిగింది.. అసలే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమని మండుతుంది.. ఒకరిపై ఒకరు దాడులు, ప్రతిదాడుల వరకు వెళ్లిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. ఏకంగా పార్టీ కార్యాలయాల్లో బాంబుల దాడికి పాల్పడిన ఘటనలు…
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకులు, పోలీసులు కుమ్మక్కై బీజేపీ కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజల మృతికి కారకులవుతున్నారని, పోలీసులు తమ పోలీస్ యూనిఫాం వదిలేసి గులాబీ కండువా కప్పుకోవాలని బీజేపీ జాతీయ ఉపాద్యక్షురాలు డీకే అరుణ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. రామాయంపేట్ లో తల్లి కొడుకుల ఆత్మహత్య, ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త మృతిపై డీకే అరుణ స్పందిస్తూ ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేసారు. ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేస్తున్న…