హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి.. నేడు కూడా ఆందోళన చేపట్టేందుకు విద్యార్థులు సిద్ధమయ్యారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నిన్న రణరంగంగా మారింది. ఆదివారం రాత్రి 400 ఎకరాల భూముల వేలంలో భాగంగా చదును చేసేందుకు 20 జేసీబీతో చెట్లను తొలగిస్తూ స్థలాన్ని సమాంతరంగా చేస్తుండడం పట్ల విద్యార్థులు క్యాంపస్ ముందు నిరసనలతో హోరెత్తించారు..
DK Aruna : మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో సమస్యలు చాయ్ తాగినంత త్వరగా పరిష్కరిస్తామని చెప్పిన వారే ఇప్పుడు ఏమి చేస్తున్నారు? అని ఆమె ఎద్దేవా చేశారు. బుధవారం గద్వాలలో 23 రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న సర్వశిక్షా అభియాన్ (SSA) ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఆమె, వీరి డిమాండ్లకు పూర్తిగా మద్దతు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ, “సర్వశిక్షా అభియాన్…
Kishan Reddy : నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన 2024 తెలంగాణ బీజేపీకి మధురస్మృతులను మిగిల్చిందన్నారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో బీజేపీ 8 పార్లమెంట్ సీట్లు గెలిచిందని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి, బీజేపీకి మీరు అందించిన మద్దతు వల్ల మోదీ…
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని రైతులు ఉద్యమిస్తున్నారు. రైతులకు సంఘీభావం ప్రకటించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో 22 రోజులుగా చేస్తున్న మహా పాదయాత్రకు ఆయన మద్దతు ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల తిరుపతిలో పర్యటించిన తర్వాత రాజధాని విషయంలో బీజేపీ స్పష్టమైన వైఖరి తీసుకుంది. అమరావతి కోసం జరుగుతున్న ఉద్యమంలో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు షా హితబోధ చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం ఏపీ…