TBJP Chief : తెలంగాణ బీజేపీలో కీలక మార్పు చోటుచేసుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావును అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ మేరకు ఆయన నామినేషన్ దాఖలు చేయాల్సిందిగా రాష్ట్ర నాయకత్వానికి కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్టు తెలిసింది. రామచందర్‌రావు ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఇప్పటికే పార్టీ కార్యకర్తలు, నాయకులు రామచందర్‌రావుకు…
సుపరిపాలన అందించడం వల్లే బీజేపీని వరుసగా మూడుసార్లు ప్రజలు గెలిపించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. బీజేపీని మరో రెండు మూడు సార్లు అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ బీజేపీకి స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు బీజేపీని సమర్థించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం సభలో ఎంపీ పురంధేశ్వరి మాట్లాడారు.
తెలంగాణలో నిజమైన మార్పు రావాలంటే నిజమైన ప్రజా ప్రభుత్వం బీజేపీతోనే సాధ్యమని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 12 నెలల్లో ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదని.. ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యమ శంఖారావం పూరించామన్నారు.