RIP Kota Srinivasa Rao: అనారోగ్యం దృష్ట్యా నటుడు కోటా శ్రీనివాస రావు మృతి నేడు తెల్లవారుజామున మృతి చెందారు. నటుడు కోటా శ్రీనివాస రావు మృతి పట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంతాపం తెలిపారు. విలక్షణ నటుడు, మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకుడు కోటా శ్రీనివాస రావు పరమపదించారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామన్నారు. వారు అనేక అంశాలపై లోతైనా అవగాహనా కలిగిన వ్యక్తి వారితో నాకు ఆత్మీయ అనుబంధం ఉందని తెలిపారు.…
బీజేపీ సీనియర్ నేత, మైనారిటీ విభాగంలోని కీలక నాయకుడు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభకు ప్రాతినిధ్య వహిస్తున్న ఆయన పదవీకాలం రేపటితో అయిపోతుంది.
తెలంగాణలో (Telangana) ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ (BJP) చూస్తోంది. ఇదే క్రమంలో రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ (TRS) వైఫల్యాలను ఎండగడుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. తెలంగాణలో బలపడటానికి బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi sanjay) కూడా ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. గ్రామ గ్రామాలు తిరిగి టీఆర్ఎస్పై విమర్శలు చేస్తున్నారు. ఇక తాజాగా తెలంగాణ బీజేపీ నాయకులకు అండగా బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్…
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు కొత్త స్క్రిప్ట్ తయారుచేసుకుని సినిమా చూపిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీతారాముల దర్శించుకున్న ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పై ధ్వజం ఎత్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని ఆయన విమర్శించారు. దళితులకు 3 ఎకరాల భూమి, అంబేద్కర్ విగ్రహావిష్కరణ, ఉద్యోగ నోటిఫికేషన్లు, రెండు పడక గదుల ఇల్లు, దళిత…