గత వారం బెంగాల్‌లోని అసన్‌సోల్ లోక్‌సభ, బాలీగంజ్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. సీఎం మమతా బెనర్జీ సారథ్యంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఊహించినట్లుగానే ఈ రెండు స్థానాలలో క్లీన్ స్వీప్ చేసింది. ఇక, బాలీగంజ్‌లో వామపక్షాలు రెండో స్థానంలో నిలవటం విశేషం. మరోవైపు, బీజేపీకి ఈ ఉప ఎన్నికలలో గట్టి దెబ్బ తగిలింది. అసన్‌సోల్‌ను కోల్పోవడమే గాక ఓట్లు కూడా గణనీయంగా కోల్పోయింది. నిజానికి, 2021 అసెంబ్లీ ఎన్నికల నుంచే బీజేపీలో ఈ క్షీణత…