తెలంగాణ సర్కార్, సీఎం కేసీఆర్, ఆయన ఫ్యామిలీపై మరోసారి ఫైర్ అయ్యారు బీజేపీ నేత విజయశాంతి అలియాస్ రాములమ్మ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ దీక్షలో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ… అన్ని జిల్లాల్లో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.. కానీ, ఖాళీలను భర్తీ చేయడం లేదు.. పది మంది ఉద్యోగులు చేయాల్సిన పని.. ఇద్దరితో చేయిస్తున్నారని మండిపడ్డారు. జిల్లాల్లో పెండింగ్ ఫైళ్లు పెరిగిపోతున్నాయన్నారు. ఇక, సచివాలయంలోనూ ఫైళ్లు పేరుకపోతున్నాయన్న ఆమె..…