Ponnam Prabhakar: తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ వస్తు, సేవల పన్ను(GST) విషయంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. GSTని ప్రవేశపెట్టినప్పుడే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దానిని “గబ్బర్ సింగ్ ట్యాక్స్”గా అభివర్ణించారని, ఇది దేశ ప్రజలకు దోచుకునే ఆయుధంగా మారిందని ప్రభాకర్ అన్నారు. పెట్రోల్, డీజిల్ వంటి వాటిని GST పరిధిలోకి తీసుకురావాలని రాహుల్ గాంధీ సూచించినా.. మోదీ ప్రభుత్వం దానిపై స్పందించలేదని ఆయన పేర్కొన్నారు. Most Wanted…