ఆంధ్రప్రదేశ్‌ను 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల ప్రదేశ్‌గా మార్చేస్తున్నారని మాజీ ఎంపీ జయప్రద ఆవేదన వ్యక్తం చేశారు. తన జన్మభూమి రాజమండ్రి అని , కర్మభూమి ఉత్తరప్రదేశ్ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. కొన్ని పరిస్థితుల్లో తాను ఉత్తరప్రదేశ్‌కు వెళ్లినట్లు వివరించారు. రాజమహేంద్రవరంలో ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బీజేపీ గోదావరి గర్జన సభకు పార్టీ’ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చడానికే…