మాజీ ఎంపీ, బీజేపీ నేత రమేష్ రాథోడ్ కాసేపటి క్రితమే కన్నుమూశారు. ఆయన ఉదయం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్కు తరలించారు. ఈ క్రమంలో.. హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. ఆయన స్వస్థలం ఉట్నూరుకు రమేశ్ రాథోడ్ మృతదేహం తరలించారు. రమేష్ రాథోడ్ మృతి పట్ల బీజేపీ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.