Dr K Laxman: చాకలి ఐలమ్మ చరిత్ర ను పాఠ్యాంశాల్లో చేర్చాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు ఎంపీ లక్ష్మణ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమం నిర్వహించారు.
BJP Leader Laxman: గత ప్రభుత్వాలు ఇలాగే వ్యవహరిస్తే తెలంగాణ వచ్చేదా అని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ మండిపడ్డారు. రాష్ట్రంలో పాలన పడకేసిందని.. కేసీఆర్ పక్తూ రాజకీయాలకు పరిమితం అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కెసిఆర్ కు పూర్తి స్వేచ్ఛ ఉంది.. ఆయన పార్టీ పెట్టుకోవచ్చు అని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యంగాస్త్రం వేశారు. ఉట్టికి ఎగరనేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టు కెసిఆర్ పని ఉందని ఎద్దేవ చేశారు. ప్రత్యామ్నాయ శక్తి అంటే కుటుంబ పాలన, అవినీతి నా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ రాజకీయాలకు కాలం చెల్లిందని మండిపడ్డారు. మోడీనీ ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని లక్ష్మణ్ అన్నారు. బంగారు తెలంగాణ చేశాడు.. ఇక బంగారు భారత దేశాన్ని…